మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇవాళ తన 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ నటిస్తున్న రాబోయే సినిమా బృందం సినిమాకి సంబంధించిన ఒక చిన్న వీడియోని రిలీజ్ చేసింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి అందాల రాక్షసి, లై, పడి పడి లేచే మనసు సినిమాలకు దర్శకత్వం వహించిన హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

స్వప్న సినిమాస్ బ్యానర్ పై స్వప్న దత్  చలసాని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్, ఇంకా మిగిలిన నటుల వివరాలు ఏవి ప్రకటించలేదు. ఈ సినిమా ఒక ప్రేమకథగా రూపొందుతోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ ప్రేమకథ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల అవ్వబోతోంది. ఈ సినిమా టైటిల్ కూడా ఇంకా ప్రకటించాల్సి ఉంది.

watch video :