విజయ్ దేవరకొండ “లైగర్” ఫస్ట్ రివ్యూ..! సినిమాకి హైలైట్ ఏవంటే..?

విజయ్ దేవరకొండ “లైగర్” ఫస్ట్ రివ్యూ..! సినిమాకి హైలైట్ ఏవంటే..?

by Mohana Priya

Ads

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. పూరి కనెక్ట్స్ తో కలిసి కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది.

Video Advertisement

ట్రైలర్ చూస్తూ ఉంటే హీరో ఒక ఎంఎంఏ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారు అని అర్థమవుతోంది. ఇందులో రమ్య కృష్ణ హీరో తల్లి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా చాలా కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

minus points in vijay devarakonda liger trailer

ట్రైలర్ లో చాలా మంది ప్రముఖ నటీనటులు కనిపించారు. సినిమా బృందం అంతా కూడా ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ సినిమా రివ్యూ పోస్ట్ చేశారు. ఇందులో ఉమైర్ సంధు ఈ విధంగా రాశారు. “లైగర్ ఒక పైసావసూల్ మాస్ ఎంటర్టైనర్. విజయ్ దేవరకొండ చాలా బాగా చేశారు” అని రాశారు. అయితే ఉమైర్ సంధు అంతకుముందు చాలా తెలుగు సినిమాలకి రివ్యూలు ఇచ్చారు. కొన్ని సినిమాలకి ఇలాగే బ్లాక్ బస్టర్ అని రివ్యూ ఇచ్చారు.

liger movie censor review by umair sandhu

కానీ సినిమా చూసిన తర్వాత ఆ ఫలితం వేరే ఉంది. తెలుగు సినిమాలకే కాకుండా హిందీ సినిమాల్లో కూడా ఇటీవల విడుదల అయిన లాల్ సింగ్ చద్దా సినిమాకి ఉమైర్ సంధు చాలా బాగుంది అంటూ రివ్యూ ఇచ్చారు. కానీ ఉమైర్ సంధు చెప్పినట్టు సినిమా అంత పెద్ద గొప్పగా ఏమీ లేదు అంటూ కామెంట్స్ వచ్చాయి. మరి ఈ సినిమా విషయంలో ఈ రివ్యూ ఎంత వరకు కరెక్ట్ అనేది మాత్రం ఇంకా తెలియదు. ఇటీవల లైగర్ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇందులో కొన్ని పదాలని తొలగించాలని, కొన్ని మ్యూట్, అలాగే బ్లర్ చేయాలి అని, కొన్ని పదాల స్థానంలో వేరే పదాలు పెట్టాలని చెప్పారు.


End of Article

You may also like