బిగ్ బాస్ 4 ఫిక్స్…14 మంది కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనా? రెండు వారాల ముందే అందరు హౌస్ కి.!

బిగ్ బాస్ 4 ఫిక్స్…14 మంది కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనా? రెండు వారాల ముందే అందరు హౌస్ కి.!

by Mohana Priya

Ads

ఈ లాక్ డౌన్ సమయంలో సీరియల్స్ లేక, మొదలైన కూడా మళ్లీ ఆగిపోయి, రిపీటెడ్ ఎపిసోడ్ లతో, చాలా మందికి బోర్ కొడుతోంది. వీడియో కాల్స్ ద్వారా ఇంటర్వ్యూ తీసుకుంటూ చేసిన కొత్త షోస్ కూడా ఏవి అంతగా అలరించలేకపోయాయి. ఇలాంటి సమయంలో ఎడారిలో ఒక్క చినుకు వర్షం పడినట్టు సడన్ గా ఇటీవల మా టీవీ యాజమాన్యం బిగ్ బాస్ ఫోర్ ప్రోమో విడుదల చేసింది.

Video Advertisement

అసలు మామూలుగానే బిగ్ బాస్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అది కూడా ఇలాంటి సమయంలో షో స్టార్ట్ అయితే ఇంక టి ఆర్ పి ఏ రేంజ్ లో ఉంటుందో ముందే ఊహించుకోవచ్చు. గత సీజన్ లో తన హోస్టింగ్ తో అలరించిన కింగ్ నాగార్జున ఈ సీజన్ లో కూడా వారం వారం కంటెస్టెంట్ ల పనిపట్టే బాధ్యతను తీసుకున్నారు. ఈసారి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోయే కంటెస్టెంట్ లు వీరే అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ వైరల్ అవుతుంది.

సమయం కథనం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 4  కంటెస్టెంట్ లు

#1 జాహ్నవి దాశెట్టి – మహాతల్లి

#2 వైవా హర్ష – యాక్టర్

#3 యామిని భాస్కర్ – నర్తనశాల ఫేమ్

#4 అపూర్వ – యాక్టర్

#5 మంగ్లీ – సింగర్

#6 హంసా నందిని – యాక్టర్

#7 సునీత – సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్

#8 మెహబూబ్ – యూట్యూబర్

#9 ప్రియా వడ్లమాని – హుషారు ఫేమ్

#10 అఖిల్ సార్థక్ – సీరియల్ యాక్టర్

#11 నందు – యాక్టర్

#12 నరేష్ – జబర్దస్త్ కమెడియన్

#13 నోయల్ – సింగర్, యాక్టర్

#14 పూనమ్ బాజ్వా – యాక్టర్

ఎంతో మంది పేర్లు ప్రచారంలోకి వచ్చిన తర్వాత చివరికి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కంటెస్టెంట్ ల లిస్ట్ ఇదే. ఆగస్ట్ లో బిగ్ బాస్ మొదలవుతుంది. ఈ లిస్టులో ఉన్న వాళ్ళు బిగ్ బాస్ లో ఉంటారో లేదో తెలుసుకోవాలి అంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.  శ్రద్ధ దాస్ పేరు కూడా ఈ లిస్ట్ లో వైరల్ అయ్యింది. కానీ అందులో వాస్తవం లేదు అంటూ హీరోయిన్ శ్రద్ధ దాస్ క్లారిటీ ఇచ్చారు.

ఇప్పటికే ఎన్నో జాగ్రత్తల మధ్య అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ సెట్ తయారవుతోంది. ఈసారి షో 50 రోజులు మాత్రమే నిర్వహిస్తారట. అందుకే హోస్ట్ కి, కంటెస్టెంట్ ల కి పారితోషికం కూడా మామూలుగా వచ్చే దానికంటే రెట్టింపు ఇస్తారు అన్న వార్త వినిపిస్తోంది. ఏదేమైనా చాలా రోజుల తర్వాత మళ్ళీ అసలైన ఎంటర్టైన్మెంట్ మొదలవుతోంది అని చాలామంది బిగ్ బాస్ ఫోర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


End of Article

You may also like