వైరల్ అవుతున్న లిటిల్ సోల్జర్స్ చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య పెళ్లి ఫోటోలు.!

వైరల్ అవుతున్న లిటిల్ సోల్జర్స్ చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య పెళ్లి ఫోటోలు.!

by Megha Varna

తెలుగు వారికి అమృతాన్ని పంచిన గుణ్ణం గంగరాజు స్వీయ నిర్మాణంలో వచ్చిన ‘లిటిల్ సోల్జర్స్’ లోని బేబీ కావ్య గుర్తుందా?అప్పట్లో ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్లతో ప్రేక్షకులను బాగా అలరించింది.ఆ బేబీ కావ్య ఎవరో కాదు? గుణ్ణం గంగరాజు గారి మేన కోడలు హైదరాబాద్ లో ప్రముఖ డాక్టర్ అయిన గురువా రెడ్డి కూతురు.. ఈమె పూర్తి పేరు కావ్య అన్నపరెడ్డి.

Video Advertisement

ఈమె ‘లిటిల్ సోల్జర్స్’ లో చేసిన నటనకు ఆడియెన్స్ తో పాటు అవార్డ్స్ ఇచ్చే ప్యానిలిస్ట్ లు కూడా అవాక్కుయ్యారు అందుకే ఈమెకు చైల్డ్ ఆర్టిస్ట్ క్యాటగిరీలో నేషనల్ అవార్డ్ , నంది అవార్డ్ లు ఇచ్చారు.ఈమె చివరిగా బాలు,గంగోత్రి చిత్రాలలో కనిపించింది.ఆతర్వాత చదువు కోసం కావ్య సినిమాలకు దూరమైంది.

1992 లో జన్మించిన కావ్య డాక్టర్ చదివింది.2015 లో ఈమె కుషాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈమె విదేశాల్లో ఉంటుందని సమాచారం. ఇక 2015లో జరిగిన కావ్య పెళ్లికి సంబందించిన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా వాటిని ఓ లుక్కెయ్యండి.

images source: amarramesh.com


You may also like