హైదరాబాదులో ఎల్కేజీ ఫీజు 4 లక్షలు.. బెంబేలెత్తిపోతున్న తల్లిదండ్రులు!

హైదరాబాదులో ఎల్కేజీ ఫీజు 4 లక్షలు.. బెంబేలెత్తిపోతున్న తల్లిదండ్రులు!

by Harika

Ads

తల్లిదండ్రులు ఎలాగైనా కష్టపడి పిల్లల్ని చదివించి ప్రయోజకుల్ని చేయాలనుకుంటారు, వాళ్ళని మంచి పొజిషన్లో చూడాలనుకుంటారు అయితే ఆ ఎమోషన్ ని క్యాష్ చేసుకుంటున్నాయి ప్రైవేట్ స్కూల్స్. ఏడాదికి ఏడాది ఫీజులు పెంచుకుంటూ పోతున్నాయి. పిల్లల చదువులు తల్లిదండ్రులకి భారంగా మారిపోయాయి. బడ్జెట్ పాఠశాలలు కూడా భరించలేని విధంగా ఫీజులు పెంచేసాయి.

Video Advertisement

2024 సంవత్సరానికి ఒకటవ తరగతి ప్రవేశానికి కోట్ చేయబడిన సగటు ఫీజు లక్ష నుంచి నాలుగు లక్షల పరిధిలో ఉంటాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రతి సంవత్సరం 10 నుంచి 15% ఫీజులను పాఠశాలలు పెంచడం గమనార్హం. దీనిని కట్టడానికే తల్లిదండ్రులు కింద మీద పడుతుంటే ఈ సంవత్సరం ఏకంగా స్కూల్ ఫీజులు 60 శాతం పెంచేశారు. ఇదే విషయంగా ఒక పేరెంట్ సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేయగా చాలామంది తల్లిదండ్రులు ఈ సమస్యతో రిలేట్ అయ్యారు. అయితే సదరు స్కూల్స్ మాత్రం స్కూల్ ఫీజులు పెంచడంలో సమర్థించుకుంటున్నాయి.

మేము మా అబ్బాయిని ఎన్రోల్ చేసినప్పుడు ఫీజు స్ట్రక్చర్ ఒకటవ తరగతి వరకు అయినా మారదని అనుకున్నాము, కానీ నర్సరీ నుంచి ఎల్కేజీలోకి అడుగుపెట్టడానికి స్కూల్ యాజమాన్యం ఫీజులో 70% పెంపు చేసింది అని ఒక పేరెంట్ తెలిపారు కాగా తమ పెద్ద కొడుకు నాలుగో తరగతి ఇదే స్కూల్లో చదువుతున్నాడని వాడి ఫీజు 3.2లక్షలు. అంటే చిన్నోడి కన్నా 50,000 తక్కువే అని వివరించారు. ఒకవేళ స్కూలు మార్చాలని ప్రయత్నించినా ఇంత తక్కువ సమయంలో వేరే స్కూల్లో అడ్మిషన్ దొరకటం చాలా కష్టంగా మారిందని తెలిపారు.

మరొక పేరంట్ తన కొడుకుని ఒకటో తరగతిలో చేర్చడానికి కూకట్పల్లిలో 10 స్కూలు తిరిగానని, అందులో ఫీజులు ఒక లక్ష నుంచి నాలుగు లక్షల వరకు ఉన్నాయని వివరించారు. ఏమైనా అంటే స్కూలు యాజమాన్యం
ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్ లనిచూపిస్తున్నారని పేర్కొన్నారు. అయితే స్కూలు యాజమాన్యం మాత్రం మార్కెట్లో అన్ని ధరలు పెరుగుతున్నాయి కాబట్టి నైపుణ్యమైన ఉపాధ్యాయులను కాపాడుకోవాలంటే పెద్ద మొత్తంలో జీతాలు ఇవ్వాల్సి వస్తుంది అంటూ వారి కారణాలు వారు చెప్పుకుంటున్నారు.


End of Article

You may also like