కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను విధించిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం కొన్ని సడలింపులతో లాక్ డౌన్ 4 కొనసాగుతుంది. ఈ నెలాఖరుకి ఈ లాక్ డౌన్ ముగియనుంది. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్ లో జూన్ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడగిస్తూ జైరాం ఠాకూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో 214 వైరస్ కేసులు నమోదవగా వీరిలో 63 మంది కోలుకున్నారు. అయిదు మంది మరణించారు. హమీర్పూర్ జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. హిమర్‌పూర్‌లో 63 కేసులు నమోదు కాగా సోలన్‌లో 21 కేసులు నమోదు అయ్యాయి.