లాక్ డౌన్ వల్ల ఆ ఇద్దరికి మాత్రమే మంచి జరిగిందంట..? అదెలాగంటే..?

లాక్ డౌన్ వల్ల ఆ ఇద్దరికి మాత్రమే మంచి జరిగిందంట..? అదెలాగంటే..?

by Megha Varna

Ads

బుల్లితెరపై బాగా సక్సెస్ ఐన కామెడీ షో జబర్దస్త్.ఈ షో తో కెరీర్ ను ఆరంభించి సినిమాలలోకి వెళ్లిన కమెడియన్లు చాలామందే ఉన్నారు.జనాలు ఎప్పుడూ నవ్వుకోవడానికి సిద్ధంగా ఉంటారు అలా నవ్వించడంలో విజయం సాధించింది కాబట్టే ఈ షో ఇంత సక్సెస్ అయ్యింది.లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని కూడా నిలిపివేసిన విషయం తెలిసిందే.

Video Advertisement

కరోనా కారణంగా సినిమాల షూటింగ్ లతో పాటు సీరియళ్లు, గేమ్, రియాల్టీషోలు,జబర్దస్త్ కూడా ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇటీవలే అన్ని మొదలైన సంగతి అందరికి తెలిసిందే. జబర్దస్త్ రీ స్టార్ట్ అయ్యి రెండు ఎపిసోడ్స్ కూడా టెలికాస్ట్ అయ్యాయి. సరికొత్తగా తాగుబోతు రమేష్ టీం మరియు షకలక శంకర్ టీం లు జబర్దస్త్ లో యాడ్ అయ్యాయి. అలాగే రెండు టీం లు పోయాయి.

ఇది ఇలా ఉండగా…జులై 2 గురువారం ప్రసారమైన ఎపిసోడ్ లో అదిరే అభి “ఈ లక్డౌన్ వల్ల కొందరికి మంచి జరిగింది. మరికొందరికి చెడు జరిగింది అని అన్నారు”. రమేష్, శంకర్…ఆ ఇద్దరికి మాత్రమే ఈ లాక్ డౌన్ వల్ల మంచి జరిగింది అని పంచ్ వేశారు. అలాగే లాక్ డౌన్ వల్ల ఆదివారం ఏదో సోమవారం ఏదో తెలియట్లేదు అని పంచ్ వేశారు. అంతే కాదు ఇంతకుముందు భయమేస్తే పక్కనొల్లని పట్టుకునేటోల్లం. ఇప్పుడు పక్కనొల్లని పెట్టుకోవాలంటే భయమేస్తుంది అని పంచ్ వేశారు. అయితే ఆ ఇద్దరికి మాత్రమే లాక్ డౌన్ వల్ల మంచి జరిగింది అని అదిరే అభి అనడం చర్చనీయాంశం అయ్యింది. శంకర్ మరియు రమేష్ టీంలు జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల ఆ ఇద్దరికి మాత్రమే మంచి జరిగింది లాక్ డౌన్ వల్ల అన్నట్టు అభి అన్నారు.


End of Article

You may also like