ప్రసన్న వదనం క్లైమాక్స్ సీన్ గమనించారా..? ఇలా చూపించడానికి కారణం ఇదేనా..?

ప్రసన్న వదనం క్లైమాక్స్ సీన్ గమనించారా..? ఇలా చూపించడానికి కారణం ఇదేనా..?

by Harika

Ads

సుహాస్ హీరోగా నటించిన ప్రసన్న వదనం సినిమా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాని మిస్ అయినవారు ఇప్పుడు ఈ సినిమాని చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ మీద చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ అర్థం కాకుండా ముగుస్తుంది. సూర్య అమృతని ఎవరు చంపారో అర్థం చేసుకొని వాళ్ళ మీదే గన్ పెడతాడు. అక్కడి వరకు బాగానే ఉంటుంది.

Video Advertisement

prasanna vadanam movie review

కానీ తర్వాత అమృతకి సంబంధించిన కొన్ని షాట్స్ ఇందులో చూపిస్తారు. అలా చూపించే సినిమా ఎండ్ చేస్తారు. దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటో చాలా మందికి అర్థం కాలేదు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ప్రకారం సూర్య అమృత అని ముందే చూసాడు. ఎందుకంటే సూర్యకి తనకి ప్రమాదం జరగకముందు మాత్రమే ముఖాలు క్లియర్ గా కనిపించేవి.

సినిమా చివరిలో అమృత ముఖం సూర్యకి క్లియర్ గా కనిపించినట్టు చూపిస్తారు. ఈ లెక్క ప్రకారం సూర్య అమృతని ముందే చూసాడు. అంతేకాకుండా తర్వాత కూడా సూర్య అమృతం చాలాసార్లు చూశాడు. ఇది మనకి అర్థం అయ్యేలాగా చెప్పడానికే చివరిలో అమృత వాటర్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న షాట్ చూపించారు. అది కూడా అమృత అంతకుముందు కనిపించిన డ్రెస్ లో కాకుండా, వేరే డ్రెస్ లో కనిపిస్తుంది. అంటే సూర్య అమృతని ముందే చూసాడు అని చెప్పడానికి ఇలా చూపించారు. ఈ లాజిక్ సోషల్ మీడియాలో ప్రస్తుతం కామెంట్స్ లో ఉంది.

క్లైమాక్స్ మాత్రం అర్థం కాని విధంగానే ఉంది. అలా ఎందుకు సినిమా ముగించారు అనే విషయం కూడా తెలియలేదు. ఒకవేళ సూర్యకి అమృత ముందే తెలిసి ఉంటే ఈ విషయాన్ని ఇంకా వివరంగా చూపించి ఉంటే ఇంకా బాగుండేది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సూర్య సీన్స్, అమృత సీన్స్ చూపిస్తారు. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడిన సీన్స్ లాంటివి ఏమీ ఉండవు. అసలు అలా ఇద్దరు వేరు వేరు వ్యక్తులు ఎందుకు చూపించారు అనేది కూడా అర్థం కాని విషయంగా అనిపించింది. కానీ అలా చూపించడానికి లాజిక్ ఇదే అంటూ కామెంట్స్ వస్తున్నాయి.


End of Article

You may also like