Home Filmy Adda “అపరిచితుడు” సినిమాలో ఈ సీన్ గమనించారా..? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

“అపరిచితుడు” సినిమాలో ఈ సీన్ గమనించారా..? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

by Sainath Gopi

ఇండియా గర్వించదగ్గ దర్శకుల్లో శంకర్ ఒకరు. ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి శంకర్ టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. హీరోలతో సంబంధం లేకుండా పోస్టర్ పైన ఈయన పేరు కనబడితే ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీసేవారు. శంకర్ తాను తీసే ప్రతి సినిమాలోనూ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక సోషల్ మెసేజ్ కూడా ఉండేలాగా చూస్తారు.

శంకర్ తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో ‘అపరిచితుడు’ ఒకటి. ఈ చిత్రం సౌత్ లోని అన్ని భాషల్లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విక్రమ్ హీరోగా నటించగా, సదా ఆయనకు జోడీగా నటించింది. ఈ చిత్రం లో స్క్రీన్ ప్లే , టేకింగ్, పాటలు అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలాగే ఈ చిత్రానికి విక్రమ్ నటన పెద్ద అసెట్. ఈ చిత్రం లో విక్రమ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. మూడు పాత్రల్లో విక్రమ్ తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. అప్పట్లో ఈ చిత్రం చాలా రికార్డులను క్రియేట్ చేసింది.

have you noticed this in aparichitudu movie..??

ఈ సినిమా క‌థ‌ను శంక‌ర్ మొద‌ట ర‌జినికాంత్‌కు వినిపించాడ‌ట‌. కానీ ర‌జిని ఈ క‌థ‌ను రిజెక్ట్ చేశాడ‌ట‌. దాంతో విక్ర‌మ్‌ వ‌ద్ద‌కు అప‌రిచితుడు స్క్రిప్ట్ వెళ్ళింది. విక్ర‌మ్ కెరీర్‌లోనే ఈ చిత్రం ఓ మైలురాయిలా నిలిచిపోయింది. నిర్ల‌క్ష్యం, లేజినెస్‌, అవినీతి , క‌ల్తీ వ‌ల‌న దేశం ఎలా అభివృద్ధి చెంద‌కుండా అలానే ఉండిపోతుందో అనే కాన్సెప్ట్‌తో శంక‌ర్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. ఈ చిత్రం లో విక్రమ్ రాము, రెమో, అపరిచితుడు పాత్రల్లో నటించారు. వీరిలో రెమో లవర్ బాయ్, అపరిచితుడు అన్యాయం చేసే వాళ్ళ అంతు చూస్తాడు. అలాగే రాము చాలా సౌమ్యుడు, చాలా రూల్స్ మాట్లాడతాడు, చిన్న తప్పుని కూడా భరించలేడు.

have you noticed this in aparichitudu movie..??

అయితే రాము లాయర్ కావడం తో ఓ సారి బైక్ వైర్ తెగితే ఆ కంపెనీ ని కోర్ట్ కి లాగుతాడు. కానీ ఈ సినిమాలో రాము చాలా సార్లు బండి నడుపుతాడు కానీ ఒక్కసారి కూడా హెల్మెట్ పెట్టుకోడు. అప్పుడు సినిమాలో ఎవరు గమనించలేదు. కానీ.. అన్ని రూల్స్ మాట్లాడే రాము హెల్మెట్ పెట్టుకోలేదు అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

You may also like