“కాంతార” సినిమాలో ఈ సీన్ గమనించారా..? అసలు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

“కాంతార” సినిమాలో ఈ సీన్ గమనించారా..? అసలు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

by Megha Varna

సైలెంట్ గా వచ్చి కాంతార సినిమా హిట్ కొట్టేసింది. రిషబ్ శెట్టి హీరోగా అద్భుతంగా నటించారు. ఈ కన్నడ మూవీ తెలుగు లో కూడా రికార్డ్స్ ని క్రియేట్ చేసేసింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. కన్నడ, తెలుగు, హిందీలో ఈ మూవీ భారీ వసూళ్లనే సొంత చేసుకుంది. 400 కోట్లకి చేరుకోవడమే నేది మాములు విషయమా..? విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలింస్ లో ఈ సినిమాని నిర్మానించారు.

Video Advertisement

నవంబర్ 24 నుంచి ఓటీటీ లో అందుబాటులోకి వచ్చేసింది. చాలా మందికి ఈ సినిమా తెగ నచ్చేసింది. థ్రిల్ చేసే ఎలిమెంట్స్ ఈ మూవీ కి ప్లస్ అయ్యాయి.

rishabshetty about kanthara climax..!!

క్లైమాక్స్ అయితే హైలెట్ ఆసలు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇంత పెద్ద తప్పు జరిగింది మీరు కనిపెట్టారా..? ఏదైనా సినిమాని తెర మీద కి తీసుకు రావాలంటే ఎంతో శ్రమించాలి. తెర మీదకి ఓ సినిమా తీసుకు రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అన్ని కోణాల్లో కూడా పని చెయ్యాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా కథ లో ఈ లాజిక్ ని ఎందుకు ప్రేక్షకులు పట్టుకోలేదు. కథ లోనే ఇంత పెద్ద తప్పు చేసారు. ఇంతకీ ఆ తప్పు ఏమిటనేది చూస్తే.. ఈ కథ లో కోలం ఆడే వ్యక్తిలోకి దేవుడు ప్రవేశించి అన్ని విషయాలని చెప్తూ ఉంటాడు. ఒక రాజు అడవి లో ఉండే ప్రజలకి తన భూమిని ఇచ్చేస్తాడు…. కొన్నాళ్లకి వారసుడు ఆ భూమి నాదని చెప్తాడు.

rishabshetty about kanthara climax..!!

అప్పుడు కోలం ఆడే వ్యక్తి లోకి దేవుడు వచ్చి.. ‘కోర్టు మెట్ల పై రక్తం కక్కుకుని చచ్చిపోతావ్’ అని అనగా…. చెప్పినట్టే అవుతుంది. ఆ తరవాత హీరో బాబాయ్ ని చంపేస్తారు. అలానే ప్రజలని కూడా కాల్చేస్తుంటారు. ఆఖరున హీరో కోలం ఆడుతూ ఉంటాడు. ప్రజలను హెల్ప్ చేసిన పోలీస్ కి హీరో అప్పచేప్తాడు. ఇక్కడ వచ్చిన మైనస్ ఏంటంటే.. కోలం ఆడే వ్యక్తి లోకి దేవుడు వస్తే.. జనాలు నమ్మిన అతనే మంచివాడు కాదని ఎందుకు ప్రజలకి చెప్పలేదు..? ఒకవేళ వాళ్ళకి చెప్తే వారు జాగ్రత్త పడతారు కదా..? ప్రేక్షకులు ఎందుకు ఈ లాజిక్ ని పట్టించుకోలేదు..?


You may also like