చూడడానికి అచ్చం “రష్మిక మందన్న” లాగానే ఉంది కదా..? ఈమె ఎవరో తెలుసా..?

చూడడానికి అచ్చం “రష్మిక మందన్న” లాగానే ఉంది కదా..? ఈమె ఎవరో తెలుసా..?

by kavitha

Ads

నేషనల్ క్రష్ గా పాపులర్ అయిన రష్మిక మందన్న ‘పుష్ప’ మూవీతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక, ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస చిత్రాలలో నటిస్తోంది. మరోవైపు తమిళ ఇండస్ట్రీలోనూ రాణించేందుకు సిద్ధమవుతోంది.

Video Advertisement

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించే మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించబోతుంది. ఈ చిత్రంలో మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించనున్నారు. ఆమె ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ఇది ఇలా ఉంటే అచ్చం ‘రష్మిక లా కనిపిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
హీరోయిన్ రష్మిక మందన్నలా కనిపిస్తున్న ఆ సెలబ్రిటీ పేరు సనా మీర్. ఆమె ఎవరో కాదు పాకిస్థాన్ మాజీ క్రికెట్ కెప్టెన్. సనా మీర్ పాకిస్థాన్ క్రికెట్ జట్టు తరుపున 14 సంవత్సరాల పాటు ఆడి, అత్యుత్తమ క్రికెటర్ గా పేరు తెచ్చుకుంది. తన క్రికెట్ కెరీర్ లో ఆఫ్ స్పిన్నర్‌గా అసాధారణ ఆటతీరును ప్రదర్శించింది.
ఆమె 226 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడింది. అందులో 137 మ్యాచ్‌లలో జట్టుకు కెప్టెన్‌గా ఉంది. వన్డేలలో 100 వికెట్లు తీసిన మొదటి పాకిస్తాన్ మహిళా బౌలర్. 2018లో, ఐసీసీ వన్డే బౌలర్ ర్యాంకింగ్‌లో నంబర్ 1 ర్యాంక్ సాధించిన  మొదటి పాకిస్తానీ మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది. ఆమె 2010, 2014 ఆసియా క్రీడలలో పాకిస్తాన్‌కు రెండు బంగారు పతకాలను సాధించింది. ఆమె 240 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టింది. ఆమె 2009-2017 వరకు పాకిస్తాన్‌ జట్టుకు  కెప్టెన్‌గా సారధ్యం వహించింది.సనా మీర్ అంతర్జాతీయ క్రికెట్‌కు మే 2020లో రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో జరుగుతున్న మ్యాచ్‌ల కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.  37 ఏళ్ల సనా మీర్, క్రికెట్ ఆడుతున్న రోజుల్లో పాకిస్థాన్ జట్టులోని అత్యంత అందమైన క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. చాలా మంది క్రికెట్ అభిమానులు ఆమె క్యూట్ లుక్స్ ను ఇష్టపడుతారు.

Also Read: “రజనీకాంత్” తో పాటు… “మద్యానికి బానిస” అయ్యి దాదాపు తమ కెరీర్ నాశనం చేసుకున్న 6 నటులు వీరే..!

 


End of Article

You may also like