Ads
శ్రీకృష్ణుడంటే గీతా సారాంశ బోధ. శ్రీకృష్ణుని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి లభిస్తుందని స్కంద పురాణం చెబుతుంది. ఇక కృష్ణుడి విగ్రహం ఉన్న ఇల్లు సంపదలో నిండుతుందని ఆయనని గృహస్తులు పూజించడం వల్ల గృహాలకు రక్షణ లభిస్తుందని అంటారు. ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణుని భక్తులు ఎక్కువ. అలాంటిది శ్రీకృష్ణుని పూజిస్తే సమస్యలు వస్తాయంటూ ఐదవ తరగతి వర్క్ బుక్ లో పాఠాన్ని చేర్చారు. ఇప్పుడు దీనిపై పలు టీచర్ల సంఘాలు హిందూ టీచర్లు మండిపడుతున్నారు.
Video Advertisement
అసలు విషయానికి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పాఠ్యపుస్తకాలను రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి రూపొందిస్తుంది. అయితే 2023-24 విద్యా సంవత్సరానికి గాను రూపొందించిన 5వ తరగతి తెలుగు తొలిమెట్టు వర్క్ బుక్ లో శ్రీకృష్ణుడు పై వివాదస్పద పాఠాన్ని చేర్చారు. ప్రాక్టీస్ వీక్లీ టెస్ట్1 లో మహాభారతంలోని ఘట్టమంటూ పాఠ్యాంశాన్ని రూపొందించారు.
పాండవులు వనవాసానికి వెళ్లే సమయంలో తనను పూజించేందుకు శ్రీకృష్ణుడు వారికి ఒక విగ్రహాన్ని ఇచ్చాడు. వనవాసం పూర్తయ్యేసరికి పాండవులు చేరాల అనే గ్రామంలో ఉన్నారు. వనవాసం పూర్తి చేసుకుని తిరిగి వెళ్లే సమయంలో ఒక ఊరి వాళ్ళు శ్రీకృష్ణుని విగ్రహం తమకు ఇవ్వాలని కోరారు. పాండవులు విగ్రహాన్ని ఇవ్వగా గ్రామస్తులు శ్రీకృష్ణుడికి గుడి కట్టి పూజించారు. తర్వాత ఆ ఊరిలో రకరకాల సమస్యలు వచ్చే దాంతో స్వామీజీ సలహాతో ఆ విగ్రహాన్ని కొలనులో వదిలేసారు అంటూ పాఠంలో పొందుపరిచారు.
అయితే పాఠం పై వివాదం నెలకొంది. హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా పాఠం పెట్టారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మహాభారతంలో ఇలాంటి ఘట్టం ఏది లేదని చెబుతున్నారు. ఐదో తరగతి వర్క్ బుక్ లో ఈ పాఠాన్ని తొలగించాలని దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని తపస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ స్పందించారు. జరిగిన పొరపాటు తమ దృష్టికి రాగానే ఆన్ లైన్ నుంచి తొలగించామన్నారు. ఈ పాఠాన్ని పిల్లలకు బోధించవద్దని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అది కావాలని చేయలేదని చెప్పారు.
Also Read:ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కాదా..? ఆయన భార్య ఎవరో తెలుసా?
End of Article