ట్విట్టర్ “బ్లూ టిక్” కి అని 650 రూపాయలు ఛార్జ్ చేసారు… కానీ ఎంత నష్టపోయారో తెలుసా? అసలు ఏమైందంటే?

ట్విట్టర్ “బ్లూ టిక్” కి అని 650 రూపాయలు ఛార్జ్ చేసారు… కానీ ఎంత నష్టపోయారో తెలుసా? అసలు ఏమైందంటే?

by Mohana Priya

Ads

ట్విట్టర్​ను అధికారికంగా కొనుగోలు చేసిన వెంటనే.. సంస్థలో కీలక మార్పులు తీసుకొచ్చారు టెస్లా సీఈఓ మరియు అపర కుబేరుడు ఆయిన ఎలాన్​ మస్క్​. అందులో భాగంగా ప్రవేశ పెట్టిందే బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్. ట్విట్టర్ లో ఇప్పుడు అకౌంట్ కి బ్లూ టిక్ రావాలి అంటే ఎనిమిది డాలర్లు అంటే సుమారు 650 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.

Video Advertisement

కానీ ఈ ఎనిమిది డాలర్ల విలువ చేసే బ్లూ టిక్ ఒక కంపెనీకి తెచ్చిన నష్టం అక్షరాల 15 బిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.1.22 లక్షల కోట్లు. అమెరికాకి చెందిన ఒక ఫార్మా కంపెనీ అయిన ‘ఇలై లిల్లీ అండ్ కంపెనీ’ఈ బ్లూ టిక్ గందరగోళం వల్ల భారీ నష్టాన్ని చవిచూసింది.

why elon musk targetted vijaya gadde..??

ఈ మధ్యకాలం వరకు వార్తా సంస్థలకు ,సెలబ్రిటీస్ , రాజకీయ నాయకులు మరియు అతి ముఖ్యమైన విఐపిలకి మాత్రమే ట్విట్టర్ బ్లూ టిక్ సదుపాయాన్ని అందించేది. ట్విట్టర్లో బ్లూ టిక్ ఉంది అంటే ఆ అకౌంట్ జెన్యూన్ అని అందరూ భావిస్తారు. కానీ ఎప్పుడైతే బ్లూ టిక్ సేవల కొరకు సబ్స్క్రిప్షన్ అమలులోకి వచ్చిందో అప్పటి నుంచే ట్విట్ట వల్ల చాలా కంపెనీలు కష్టాలు ఎదుర్కోవడం మొదలైంది.

why elon musk targetted vijaya gadde..??

నెలకు ఎనిమిది డాలర్లు చెల్లిస్తే చాలు ఎవరైనా బ్లూ టిక్ తీసుకునే వెసలు బాటు లభించడంతో ఫేక్ కంపెనీలు , ఫేక్ అకౌంట్లు ఎక్కువ అయిపోయాయి.అసలు విషయానికి వస్తే ‘ఇలై లిల్లీ అండ్ కంపెనీ’ పేరుతో ఎవరో ఒక డూప్లికేట్ అకౌంట్ ని క్రియేట్ చేసి దానికి బ్లూ టిక్ ని కొన్నారు. అంతటితో ఊరుకోకుండా వారు ఆ కంపెనీకి సంబంధించి చేసిన ఒక ప్రచారం వల్ల కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి.

elon musk 1

ఇలై లిల్లీ అండ్ కంపెనీ వాస్తవానికి డయాబెటిస్ రోగులకు అవసరమైన ఇన్సులిన్ వంటి ఉత్పత్తులను అందించే సంస్థ. ఈ కంపెనీ కి ఇంచుమించు 146 ఏళ్ల చరిత్ర తో పాటు పలు దేశాలలో ఈ కంపెనీకి సంబంధించిన బ్రాంచీలు విస్తరించి ఉన్నాయి. అయితే ఎవరో ట్విట్టర్లో ఈ కంపెనీ పేరిట ఫేక్ అకౌంట్ తెరిచి “ఇకనుంచి మేము అందరికీ ఉచితంగా ఇన్సులిన్ అందిస్తాము”అని ఒక ట్వీట్ చేయడంతో ఆ కంపెనీ చిక్కుల్లో పడింది.

అలా ట్వీట్ వచ్చిన వెంటనే ‘ఇలై లిల్లీ అండ్ కంపెనీ’ షేర్లు భారీగా పడిపోయాయి. శుక్రవారం నాడు, ఒకే ఒక్క రోజులో ఆ కంపెనీ షేర్ విలువ సుమారు 4.37శాతం పడిపోవడంతో కంపెనీ 15 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువను కోల్పోయింది. ఇలా కేవలం ఒక్క డూప్లికేట్ అకౌంట్ సృష్టించిన గందరగోళం వల్ల షేర్ మార్కెట్ షేక్ అయింది. చివరకు ఆ కంపెనీ స్వయంగా ట్విట్టర్లో వివరణ ఇచ్చే పరిస్థితి ఏర్పడింది.


End of Article

You may also like