Ads
అతనికి వయసు 67 సంవత్సరాలు, ఆ అమ్మాయి వయస్సు 19 సంవత్సరాలు ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు..వీరి స్టోరీ లో ట్విస్టులు మాములుగా లేవు.. వివరాల్లోకి వెళితే వారి గ్రామంలో భూతగాదాలు ఉన్నాయి వాటిని తాను పరిష్కరిస్తానంటూ ఆ అమ్మాయి కుటుంబానికి దగ్గరయ్యాడు. హర్యానా రాష్ట్రంలోని హతిన్ నగర పరిధిలోని హంచ్‌పురీ గ్రామంలో ఇదంతా జరిగింది. అతనికి గతం లో వివాహం జరిగింది అతడికి ఏడుగురు కుమార్తెలు, అంతేకాదు వారందరికీ పెళ్లిళ్లు కూడా అయ్యాయి.
Video Advertisement
వీరి వ్యవహారం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. మనవరాలు వయసున్న అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని ప్రశ్నించారు. ఈ గొడవతో ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి, అటు తరువాత హర్యానా హైకోర్ట్ ని ఆశ్రయించారు. వీరి కేసులో పలు అనుమానాలు వ్యక్తం చేసిన హై కోర్ట్ ఇద్దరినీ వేరు వేరుగా ఉంచి విచారణ చేపట్టాలని ఆదేశించింది.. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులకి దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ వృద్ధుడే ఆమెను బెదిరించి పెళ్లి చేసుకుని ఉంటాడని భావించిన పోలీసులు విచారణలో ఆమెకు ముందే పెళ్లి జరిగిందనీ ఆ అమ్మాయి తన భర్తతో విడిపోయిందని ఆ అమ్మాయి కూడా ఇష్టపూర్వకంగానే పెళ్ళికి ఒప్పుకుందని తనని ఎవ్వరు బలవంత పెట్టలేదని తేల్చారు పోలీసులు.
ఆ అమ్మాయి మాటలు ఎలా ఉన్నాయి అంటే ” అవును ఆయనకి గతంలోనే వివాహం జరిగిన సంగతి నాకు తెలుసు, ఏడుగురు పిల్లలు ఉన్నారని వారందరికీ వివాహం కూడా జరిగింది ప్రస్తుతం ఎవరూ ఆయనతో తోడుగా లేరు మేము కూడా సంతోషంగా ఉన్నాము, అంతే కాదు ఈ విషయం తన తల్లి కూడా కూడా తెలుసునని వీరి వివాహ సమయంలో కొంత బంగారం కూడా ఆయన ఇచ్చారని కూడా పోలీసులకి తెలిపింది ఆ అమ్మాయి అంటూ ఆ ఆయువతి సమాధానం మేజిస్ట్రేట్ ముందు సమాధానం ఇచ్చింది.భూతగతధలు పరిష్కరిస్తానని ఆ కుటుంబం తో చనువు పెంచుకుని భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చిన ఆ అమ్మాయికి ఎలాంటి మాటలు చెప్పాడో ఏమో కానీ అతని మాయలో పడి అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ద పడింది ఆ అమ్మాయి. వయసు లో ఎంతో తేడా ఉన్నా కూడా ఇద్దరు మేజర్ లు కావడం వలన కోర్ట్ ఎలాంటి తీర్పుని ప్రకటిస్తుందోనని గ్రామస్థలు ఎదురు చూస్తున్నారు.
End of Article