నా గురించి తెలియని వాళ్లకి ఇది కొత్త విషయం…కులం గురించి సాయి పల్లవి కామెంట్స్..!

నా గురించి తెలియని వాళ్లకి ఇది కొత్త విషయం…కులం గురించి సాయి పల్లవి కామెంట్స్..!

by Sunku Sravan

Ads

భానుమతి సింగిల్ పీస్..హైబ్రీడ్ పిల్లా.. డైలాగ్ గుర్తుంది కదా ఫిదా సినిమాలో.. ఆ డైలాగ్ ఆ సినిమా వరకే అయినా.. సాయిపల్లవి నిజంగానే సింగిల్ పీస్ , హైబ్రీడ్ పిల్లే..హీరోయిన్ అంటే అందంగా ఉండాలా? అందాలారబోయాల్సిందేనా?? అక్కర్లేదు అంటూ అలాంటి కామెంట్స్ కి చెక్ పెట్టేసింది సాయిపల్లవి.. సినిమా ఇండస్ట్రీలో తనొక అధ్బుతం అంతే..

Video Advertisement

అప్పుడెప్పుడో ఒక డ్యాన్స్ షో, తర్వాత విదేశాల్లో డాక్టర్ కోర్సు..మళ్లీ సడన్ గా సినిమాల్లో మెరుపులా మెరిసింది. అందరి హృదయాలు కొల్లగొట్టింది.. అబ్బాయిలకు కలల దేవతగా, అమ్మాయిలకు ఆత్మవిశ్వాసంగా మారింది. ముఖంపైన ఒక మొటిమ వస్తేనే నానా హైరానా పడే అమ్మాయిలకు తనొక రోల్ మోడల్ అంతే. ముఖం పై మచ్చల్ని కన్సీలర్ తో కవర్ చేసి, మేకప్ అద్దే అందాల మధ్య , ముఖం నిండా ముటిమలతో, ఎలాంటి మేకప్ లేకుండా నటించి అసలైన హీరోయిన్ కి అర్ధం చెప్పింది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి చెప్పిన విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.“ఒక వేళ నేను నటిని కాకుంటే ఎంబీబీఎస్‌ తరవాత కార్డియాలజీ ఎంచుకుని కార్డియాలజీస్ట్ అయ్యేదానిని. మాది తమిళనాడులోని బడుగ అనే గిరిజన తెగ. మా భాష బడుగకు లిపి లేదు… నా గురించి తెలియని వాళ్లకి ఇది కొత్త విషయం” అంటూ  తెలిపింది. ఇందులో విషయం ఏముంది. ఎందుకు లేదు మన దేశంలో, మన సమాజంలో కులానికున్నంత ప్రాముఖ్యత మరొక విషయానికి ఉండదు..

సాయిపల్లవి విషయంలోనూ అదే జరిగింది. ఎస్ సాయిపల్లవి గిరిజన అమ్మాయా. సాయిపల్లవి ఎస్ .టి ఆ అంటూ చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. నిజానికి ఎక్కడైనా క్యాస్ట్ గురించి ప్రస్తావన రాగానే ఒక రకమైన ఇబ్బందికి గురౌతుంటారు. చాలామంది తమ కులాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు , కాని సాయిపల్లవి ధైర్యంగా చెప్పింది..తను సాయిపల్లవి కాబట్టే చెప్పింది..

తనకు బాగా ఆటీట్యూడ్ ఎక్కడో విన్నాను ఈ మాట, నానితో ఎమ్ సి ఎ షూటింగ్ తర్వాత అనుకుంటా ఎక్కువగా వార్తల్లో ఇలాగే నానింది సాయిపల్లవి పేరు.. సాయిపల్లవి లాంటి అమ్మాయిలకు ఆటిట్యూడే అందం.అయినా అమ్మాయిలు తమకు విలువలకు తగినట్టుగా బతికితే దానికి పెట్టే పేరు ఆటిట్యూడ్, పొగరు. తనొక అధ్బుతం అంతే.. సినిమాల్లో ఛాన్సులు లేకపోతే వెళ్లిపోయి తన డాక్టర్ వృత్తి ప్రాక్టీస్ చేసుకుంటుంది అంతే తప్ప ఇక్కడే ప్రాకులాడుతూ కూర్చోదు. తనొక సినిమా చేయాలంటే ముందు అందులో తన పాత్ర తనకి నచ్చాలి.

పాత్ర ప్రాధాన్యత, నో ఎక్స్ పోజింగ్ ఇవి సాయిపల్లవి నియమాలు..ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి వీటిని అధిగమించింది లేదు, ఆ నియమాల్ని దాటమని మీరు కోట్లు ఆఫర్ చేసినా నో అనేస్తుంది.. ఒక చిన్న ఉదాహరణ ఒక ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ కోసం వాళ్లు ఆఫర్ చేసిన  కోటి రూపాయలను చాలా సింపుల్ గా రిజెక్ట్ చేసింది.ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే సాయిపల్లవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అబ్బా..చెప్పుకోవాలనిపిస్తూనే ఉంటుంది.


End of Article

You may also like