ఇప్పటికే నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన లవ్ స్టోరీ సినిమా రెండు మూడు సార్లు వాయిదా పడింది. ఈ సంవత్సరం మొదట్లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. తర్వాత సెప్టెంబర్ మొదట్లో విడుదల అవుతుంది అన్నారు. మధ్యలో డైరెక్ట్ డిజిటల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నారు. కానీ సినిమా బృందం మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా “లేదు. మేము థియేటర్లలోనే విడుదల చేస్తామని” చెప్పారు. సినిమా టీజర్, పాటలు కూడా చాలా హిట్ కావడంతో ప్రేక్షకులు కూడా సినిమాను థియేటర్లలో చూడటానికి ఇష్టపడుతున్నారు.

New hero heroine pairs in this year

థియేటర్లలోనే విడుదల చేస్తేనే బాగుంటుంది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ సినిమా బృందం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అది ఏంటంటే, సినిమాలో కొన్ని సీన్లు సరిగ్గా రాకపోవడంతో మళ్ళీ రీ షూట్ చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం మళ్ళీ సినిమా బృందమంతా నిజామాబాద్ వెళ్లారట. ఈ రీ షూట్ మొత్తం పది రోజుల్లో ముగించేయాలని టీం నిర్ణయించుకున్నట్లు సమాచారం. చివరి నిమిషంలో ఇలా రీషూట్ చేయడం అనేది కొంచెం రిస్క్ తో కూడుకున్న పని. ఏదేమైనా ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.