Ads
విజృంభిస్తున్న కరోనా కారణంగా దాదాపు దేశంలో పూర్తి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.దీంతో సెలబ్రిటీల దగ్గర నుండి సామాన్య ప్రజల వరకు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు.ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఎవరికి తోచిన సహాయం వారు చేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు.లాక్ డౌన్ కారణంగా ప్రతిరోజూ చిత్ర విచిత్రమైన సంఘటనలు జరిగి సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్నాయి .వాటిలో కొన్ని నవ్వించే విధంగా ఉంటె ..మరికొన్ని కళ్ళు చెమర్చేలా ఉంటున్నాయి ..
Video Advertisement
representative image only
సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో డ్రోన్ కెమెరాల పాత్ర అద్భుతం.ఒక చోట నుండి రిమోట్ తో ఆపరేట్ చేస్తూ గాలిలో కెమెరా ను కిలోమీటర్ల దూరం పంపించి అక్కడ జరుగుతున్న దృశ్యాలను చూడవచ్చు.దీంతో ఇది పోలీస్ లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ..ఈ నేపథ్యంలో డ్రోన్ కెమెరాకు ఒక ప్రేమ జంట చిక్కుకుంది ..దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ..ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ..
ఈ నేపథ్యంలో ఇది వరకు కొంతమంది పొలాల్లో కూర్చుని క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ ఉండగా కెమెరా కు చిక్కారు.ఆ వీడియో అప్పట్లో వైరల్ అయింది..తాజాగా ఒక ప్రేమ జంట పొలాల్లో కలిసి ఉండగా కెమెరాకు చిక్కారు ..కెమెరా తమ ముందుకి వచ్చింది అనే విషయాన్నీ తెలుసుకున్న ఆ జంట అక్కడి నుండి బైక్ మీద వేగంగా పారిపోయారు.ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.సామాజిక దూరం పాటించమని ప్రభుత్వాలు అంతలా చెప్తుంటే ఈ సమయంలో ఇలా తిరగడం అవసరమా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు…
representative image only
డ్రోన్ కెమెరాలను ట్రాఫిక్ పరిస్థితిని వీక్షించేందుకు,ఏదైనా సమాచారం అందించేందుకు ,అత్యంత వేగంగా దూర ప్రాంతంలో ఉన్న పరిస్థితిని సమీక్షించేందుకు బాగా ఉపయోగపడుతుంది..ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ను అదుపు చేసేందుకు మెడిసిన్ స్ప్రే చేసేందుకు డ్రోన్స్ ను ఉపయోగిస్తున్నారు పోలీసులు ..కరోనా వైరస్ ను అదుపు చేయడానికి సామాజిక దూరం పాటించాలని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు అసలు ప్రజలు సామజిక దూరం పాటిస్తున్నారా లేదా అనే విషయాన్నీ తెలుసుకునేందుకు డ్రోన్ కెమెరాలను పొలాలలోకి ,జన సంచారం లేని ప్రదేశాలకు కూడా డ్రోన్ కెమెరాల సాయంతో చూసి ఎవరైనా అలా గుంపులుగా ఉంటే పోలీసులు అక్కడకి చేరుకొని వారిని పట్టుకుంటున్నారు.
watch video:
End of Article