Ads
LPG cylinder: ఇక పై మీకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ దగ్గర గ్యాస్ తీసుకునే అవకాశం ! ప్రస్తుతం గ్యాస్ వినియోగదారులు ఏదో ఒక గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద మాత్రమే ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ అవకాశాన్ని సవరిస్తూ మార్పులు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక మీదట ఇష్టం వచ్చిన డిస్ట్రిబ్యూటర్ వద్ద వంట గ్యాస్ ను తీసుకునే సదుపాయం కల్పిస్తూ చట్టం మార్పులు చేస్తామని ప్రకటించారు కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధన వనరులశాఖ మంత్రి రామేశ్వర్ తెలీ.
Video Advertisement
అతి త్వరలోనే మార్పులు అమలు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం లోక్ సభజరుగుతున్న సంగతి తెలిసిందే ఈ సందర్భగా కొందరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా జవాబు ఇస్తూ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఎల్ఫీజి వినియోగదారులు తామే డిస్ట్రిబ్యూటర్ ని ఎన్నుకునే చేసుకునే అవకాశం ఉండదా? అని ఎంపీలు అడిగిన ప్రశ్నకు మంత్రి ఇక మీదట స్వయంగా ఎన్నుకునే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి : మెగాస్టార్ నటించిన ఆ సినిమాలో పాటనే “నారప్ప” లో ఎందుకు వాడారు.? ?
End of Article