ఇటీవల లక్నోలో ఒక యువతి, ఒక క్యాబ్ డ్రైవర్ ని కొట్టిన సంఘటన మన అందరికి తెలిసిందే. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఎంతో చర్చ జరిగింది. ఆ అమ్మాయిని అరెస్ట్ చేయండి అంటూ ఎంతో మంది నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా తర్వాత జరిగిన సంఘటనని పరిశీలించి చూస్తే, తప్పు ఆ అమ్మాయిది అని తేల్చారు. అయితే, ఇటీవల రాఖీ పండగకి ఆ అమ్మాయి ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకుంది.lucknow girl shocking decision on rakhi

అదేంటంటే, ప్రియదర్శిని అనే ఈ యువతి, ఆ సంఘటనలో ఉన్న క్యాబ్ డ్రైవర్ సాదత్ ఇంటికి వెళ్లి, అతనికి రాఖీ కట్టి జరిగిన గొడవని ముగించాలి అనుకుందట. అనుకున్నట్టుగానే ప్రియదర్శిని క్యాబ్ డ్రైవర్ సాదత్ ఇంటికి రాఖీతో పాటు, స్వీట్స్ తీసుకెళ్ళిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏదేమైనా ఆమె తప్పు తెలుసుకొని క్యాబ్ డ్రైవర్ కి క్షమాపణ చెప్పాలి అని, అలాగే తనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని, అంతే కాకుండా ప్రియదర్శిని అక్కడ జరిగిన నష్టాన్ని జరిగిన నష్టాన్ని కూడా భర్తీ చేయాలి అని డిమాండ్ చేశారు నెటిజన్లు.