Ads
పూజా హెగ్డే సౌత్ ఇండియా మరియు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. పూజా తెలుగులో ఒక లైలా కోసం, తమిళంలో మిస్కిన్ ముగమూడి సినిమాల ద్వారా ఎంటర్ అయ్యింది. బాలీవుడ్ లో హృతిక్ రోషన్‌తో కలిసి మొహెంజొదారోలో నటించింది.
Video Advertisement
అది బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా అయ్యింది. పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో ఫ్లాప్ లను ఎదుర్కొంది. అయితే ఆ తరువాత అల్లు అర్జున్ DJ సినిమా ఆమెకు బ్లాక్‌బస్టర్ హిట్ ని అందించి ఆమె గ్రాఫ్ ను ఒక్కసారిగా మార్చేసింది.
ఆ సినిమా తర్వాత పూజా హెగ్డేకి టాలీవుడ్, కోలీవుడ్ లో వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఆమె తెలుగులో మహర్షి, అరవింద సమేత, అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా మారింది. పూజా హెగ్డే తమిళ సినిమాలలో కూడా నటించింది.
పూజా హెగ్డే పాన్-ఇండియా సినిమాలతో భారతీయ చిత్రసీమలో స్టార్ హీరోయిన్. పూజా హెగ్డే సినిమాల నుండి, ఎండార్స్‌మెంట్‌ల నుండి భారీగా సంపాదీస్తోంది. పూజా హెగ్డే ఆస్తుల విలువ సుమారుగా 50 కోట్లు. ఆమెకు ఖరీదైన కార్లు, హ్యాండ్‌బ్యాగులు సేకరించే అభిరుచి ఉంది.ఇక పూజా హెగ్డే లగ్జీరియస్ లైఫ్ గురించి, ఆమె దగ్గరున్న విలువైన 9 ఖరీదైన వస్తువులు ఏమిటో ఇక్కడ చూద్దాం..
1. పూజా హెగ్డే దగ్గర ఖరీదైన పోర్షే కయెన్ కారు ఉంది. దీని ధర 2 కోట్ల రూపాయలు.
2. హైదరాబాద్‌లో రూ. 5 కోట్ల విలువైన ఇల్లు తీసుకుంది.3. ముంబైలోని బాంద్రాలో సముద్రం వైపు వ్యూ ఉండే అపార్ట్‌మెంట్ తీసుకుంది.దీని విలువ రూ. 6-8 కోట్లు
4. పూజా దగ్గర రూ. 1.08 కోట్ల విలువైన జాగ్వార్ కారు ఉంది.5. బుట్టబొమ్మ వద్ద రూ. 80 లక్షల విలువైన BMW 350d కారు ఉంది.6. ఆమె దగ్గరున్న ఆడి క్యూ7 విలువ రూ. 85 లక్షలు.7. పూజా హెగ్డే దగ్గర క్రిస్టియన్ డియర్ హ్యాండ్ బ్యాగ్ ఉంది. ఈ బ్యాగ్ విలువ రూ. 1.3 లక్షలు
8. లూయిస్ విట్టన్ క్రోయిసెట్ హ్యాండ్ బ్యాగ్ విలువ రూ. 1.4 లక్షలు.9. లూయిస్ విట్టన్ వైట్ హ్యాండ్ బ్యాగ్ ధర రూ. 1.91 లక్షలు
End of Article