Ads
- చిత్రం : మాచర్ల నియోజకవర్గం
- నటీనటులు : నితిన్, కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా.
- నిర్మాత : సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
- దర్శకత్వం : ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి
- సంగీతం : మహతి స్వర సాగర్
- విడుదల తేదీ : ఆగస్ట్ 12, 2022.
Video Advertisement
స్టోరీ :
సిద్ధూ (నితిన్) సివిల్స్ లో టాప్ ర్యాంకర్. ఐఏఎస్ ఆఫీసర్ గా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో సిద్ధూ పక్కింట్లో స్వాతి (కృతి శెట్టి) దిగుతుంది. తర్వాత వారిద్దరూ ప్రేమించుకుంటారు. స్వాతితో పాటే సిద్ధూ కూడా మాచర్లకి వెళ్తాడు. గుంటూరులో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా నియమితుడవుతాడు. ఈ నేపథ్యంలో రాజకీయ వేత్త రాజప్ప (సముద్రఖని) కి సిద్ధూకి మధ్య గొడవలు అవుతాయి. తర్వాత వారిద్దరికీ మధ్య ఏమయ్యింది? సిద్ధూ, స్వాతి కలిసారా? ఝాన్సీ (కేథరిన్ ట్రెసా) ఎవరు? చివరికి ఎవరు గెలిచారు? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సినిమా ట్రైలర్ చూస్తే యాక్షన్ ఎక్కువగా ఉండే సినిమా అని అర్ధమైపోయింది. నితిన్ కూడా ఇప్పటివరకు పోషించని ఒక కొత్త పాత్రలో నటించారు. పాత్ర లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. దాంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. నిజంగా నితిన్ పాత్ర వరకు అయితే సినిమా బానే ఉంది కానీ, ఎప్పుడో పది పదిహేను సంవత్సరాల క్రితం చూసిన కథలాగా ఉంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఒక్క చోట కూడా నెక్స్ట్ ఏమవుతుంది అనే సస్పెన్స్ ఎక్కడ ఉండదు. మొదటిసారి ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులు కూడా ఏమవుతుంది అనేది చెప్పగలుగుతారు.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నితిన్ బాగా నటించారు. హీరోయిన్స్ ఇద్దరు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. నితిన్ తర్వాత అంత పెద్ద స్కోప్ ఉన్న క్యారెక్టర్ వెన్నెల కిషోర్ ది. కామెడీ అంత పెద్దగా వర్కౌట్ అవ్వకపోయినా కూడా వెన్నెల కిషోర్ టైమింగ్ బాగుంది. సముద్ర కానీ పాత్ర చూస్తే ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట, అలాగే ఆయన నటించిన మరికొన్ని తెలుగు సినిమాలు గుర్తొస్తాయి. పాటల విషయానికొస్తే, కంపోజ్ చేసిన విధానం కానీ, చిత్రీకరించిన విధానం కానీ బాగుంది. నిర్మాణ పరంగా ఈ సినిమా చాలా రిచ్ గా ఉంది. లొకేషన్స్ కూడా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
- నితిన్
- పాటలు
- లొకేషన్స్
- నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
- రొటీన్ స్టోరీ
- చిరాకు తెప్పించే కామెడీ సీన్స్
- బోరింగ్ సీన్స్
- ఎన్నో పాత సినిమాలను గుర్తుకు తెచ్చే కథనం
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, సినిమా నుండి ఏమి ఆశించకుండా, ఏదైనా ఒక సినిమా చూద్దాం అనుకునేవారికి మాచర్ల నియోజకవర్గం ఒక్కసారి చూడగలిగే సినిమా అవుతుంది.
End of Article