ఈ పోస్ట్ చూడగానే కామెంట్స్ లో…భూతులు తిట్టడానికి రెడీగా ఉంటారు.! అయినా సరే…

ఈ పోస్ట్ చూడగానే కామెంట్స్ లో…భూతులు తిట్టడానికి రెడీగా ఉంటారు.! అయినా సరే…

by Megha Varna

ప్రముఖ సినీనటి , రాజకీయ నాయకురాలు మాధవీలత ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంపై స్పందిస్తూ. కాంట్రవెర్సికి తెరలేపుతుంటారు . ఎల్లప్పుడూ సామజిక మద్యమాలలో అందుబాటులో వుండే ఈ ముద్దుగుమ్మ జనం ఎక్కువగా చర్చించుకునే విషయాల మీద అసలు మొహమాటం లేకుండా నిర్భయంగా తన అభిప్రాయం చెప్పడం మాధవిలత కు అలవాటు . ఈ నేపథ్యంలోనే లేటెస్టుగా కరోనా ఎఫెక్ట్ కారణంగా దేశంలో జరుగుతున్న లాక్ డౌన్ లు , ప్రజలు పడుతున్న ఇబ్బందులు , పలు చోట్ల పోలిసుల లాఠీచార్జి పై స్పందించి మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసారు మాధవీలత ..అసలు విషయం ఏంటంటే

Video Advertisement


కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తుంది . రోజురోజుకి దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటం భయాందోళనలను కలిగిస్తుంది . ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ను అదుపు చెయ్యడానికి వున్నా ఏకైక మార్గం సోషల్ డిస్టెన్స్ అని తెలుసుకొని …. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ముఖ్యమైన నిర్ణయలు తీసుకొంటూ దేశమంతా కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటించాయి ..ఎమర్జెన్సీ పరిస్థితిలో తప్ప ఇంటి నుండి బయటకి రావద్దని రూల్ పాస్ చేసాయి .

ఈ ఆంక్షలను చాలామంది పాటిస్తున్న కొంతమంది మాత్రం తమకేమి పట్టలేదంటూ రోడ్లపై వీర విహారం చేస్తున్నారు ..మీ ఇంట్లోనే మీరు వుండండి రోడ్లమీదకి రావద్దు అని డ్యూటీలో వున్నా పోలీసులు ఎంత మొత్తుకున్న వినడం లేదు .జనం ప్రభుత్వ ఆంక్షలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా రోడ్ల మీద తిరుగుతుండడం చూసి తెలంగాణ సీఎం కెసిఆర్ సైతం ..దయచేసి బయటకు ఎవరు రావద్దని కోరారు .

అయినా అవేమి పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు తిరుగుతున్నారు జనం ..దీనితో చేసేది ఏమిలేక లాఠీచార్జి మొదలుపెట్టారు పోలీసులు …అసలు బయటకు ఎందుకు వచ్చారు కారణమేంటి అని అడగకుండా వచ్చినవాళ్ళని వచ్చినట్లు లాఠీలతో చిదకబాదుతున్నారు పోలీసులు . ఈ నేపథ్యంలో అత్యవసరంగా వచ్చినవాళ్లు సరదాగా టైంపాస్ కి వచ్చినవాళ్లు కూడా వుంటున్నారు . ఇలా జనాన్ని పోలీసులు కొడుతున్న వీడియోలు సామజిక మద్యమాలలో వైరల్ అవుతున్నాయి .

ఈ విషయంపై స్పందిస్తూ సెన్సషనల్ కామెంట్స్ చేసింది మాధవీలత ..బ్లడీ స్టుపిడ్ పోలీస్.. సైకోల్లా బిహేవ్ చేతున్నారంటూ సెన్సేషన్ క్రియేట్ చేసింది.నేను ఇలా స్పందించడం వలన జనం నన్ను తిట్టుకుంటారని తప్పుగా అర్ధం చేసుకుంటారని తెలుసు …అయినా ఏంపర్వాలేదు రండి తిట్టండి అంటూ పోలీసులపై ధ్వజమెత్తింది మాధవీలత.

పోలీసులు జనాలపై లాఠీలతో విరుచుకు పడుతున్న వీడియోలను తన అకౌంట్లో పోస్ట్ చేసారు మాధవీలత ..పోస్ట్ చేసిన మాధవీలత.. ‘కమాన్, మైడియర్ సోషల్ మీడియా హీరోస్.. నీఛమైన కామెంట్స్‌తో నన్ను ఎటాక్ చేయడానికి గెట్ రెడీ’ అంటూ మొదలు పెట్టి.. ‘కారణం తెలుసుకోవాలి.. అతిక్రమిస్తే కేసులు పెట్టమన్నారు. ఇలా కొట్టమననేదు.(కొందరు మాత్రమే).. పోలీసులు కరోనా కారణంగా నిరంతరం తమ సేవలను అందిస్తూ కష్టపడుతున్నారు సరే ..వాళ్ళు కూడా మనుషులే .మీరు కూడా మానవత్వంతో మసులుకోండి .

బయటకు తిరుగుతున్న ప్రజలందరూ ఏ పని లేకుండా రావట్లేదు ..రకరకాల అవసరాల కొద్దీ వస్తున్నారు . ఏ కారణం లేకుండా బయట తిరిగే వారిపై లాఠీచార్జి చేయడం మానుకొని ఫైన్ విధించండి . బాధ్యతారహితంగా బయట తిరిగే వారిని ఇలా సైకోల్ల కొట్టే బదులు జరినామా విధిస్తే సరిపోతుంది కదా అంటూ విరుచుకు పడింది .

మాధవీలత చేసిన ఈ కామెంట్స్ పై కొంతమంది పాజిటివ్ గాను కొంతమంది నెగటివ్ గాను స్పందిస్తున్నారు …కొంతమంది మాధవీలత చెప్పినట్లుగానే తిడుతుంటే కొంతమంది మాత్రమే మాధవీలత చెప్పింది నిజమే కదా జరిమానా విధిస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నారు …


You may also like

Leave a Comment