Ads
సెలబ్రిటీల జీవితం ఒక తెరిచిన పుస్తకంలాంటిది. వారికి సంబంధించిన చిన్న విషయం నుండి పెద్ద విషయం వరకు అన్నీ వాళ్లు అధికారికంగా ప్రకటించకుండానే వైరల్ అయిపోతాయి. ఇప్పుడు అదే విధంగా నాగ చైతన్య, సమంత విడాకులకు సంబంధించిన విషయాల గురించి కూడా అంతకుముందే చాలా పుకార్లు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం వారిద్దరూ అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకుల విషయం ప్రకటించిన తర్వాత చాలా మంది సమంతని తప్పుపట్టడం మొదలుపెట్టారు.
Video Advertisement
సమంత డ్రెస్సింగ్ సెన్స్ వల్ల విడాకులు తీసుకోవాల్సివచ్చింది అని కామెంట్ చేశారు. అంతే కాకుండా ఫ్యామిలీ మాన్ సిరీస్ కూడా అందుకు ఒక కారణమని అన్నారు. విడాకులు తీసుకోవడంలో తప్పు మొత్తం సమంతదే అని మాట్లాడారు. ఈ విషయంపై ప్రముఖ నటి మాధవీ లత స్పందించారు. “విడాకుల విషయంలో సమంతను తప్పుపట్టడం చాలా పొరపాటు” అని చెప్పారు. “అక్కినేని ఫ్యామిలీ వల్ల సమంత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని, సమంత స్వతహాగా చాలా మంచి వ్యక్తి అని, తనపై ఇలాంటి ఆరోపణలు చేయకండి” అని అన్నారు.
“ఎక్కడైనా కానీ విపత్కర పరిస్థితి వస్తే, తమ వంతు సహాయం చేసే వారిలో సమంత ముందువరుసలో ఉంటారు” అని చెప్పారు. “అక్కినేని కుటుంబం వాళ్ళు తనని కేవలం ఒక డబ్బు మిషన్ లాగా చూశారు అని, పెళ్లయిన తర్వాత కూడా అక్కినేని కుటుంబం సమంతకి వేలల్లో పాకెట్ మనీ ఇస్తుంది అని, ఎన్ని కోట్లు సంపాదించినా కూడా పాకెట్ మనీ మీద సమంత బతికారు” అని చెప్పారు. “సమంత ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు అని, అలాంటి మంచి వ్యక్తిపై ఇలాంటి కామెంట్స్ చేయొద్దు అని, డ్రెస్సింగ్ సెన్స్ వల్ల వాళ్ళు విడిపోయారు అనడం అనేది చాలా తప్పు” అని చెప్పారు మాధవీ లత.
watch video :
https://youtu.be/K6MDRhQD9Ew
End of Article