రష్మిక చూపించి షో చేసేదానికంటే ఆ వీడియోలో తక్కువ ఏం లేదు… కరెక్ట్ గా చెప్పారు అంటూ “మాధవి లత”పై ప్రశంసలు.!

రష్మిక చూపించి షో చేసేదానికంటే ఆ వీడియోలో తక్కువ ఏం లేదు… కరెక్ట్ గా చెప్పారు అంటూ “మాధవి లత”పై ప్రశంసలు.!

by Mounika Singaluri

Ads

తాజాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన అందరూ కూడా టెక్నాలజీ వల్ల ముందు ముందు ఎంతటి ప్రమాదం ఉందో అంటూ భయపడుతున్నారు. ఈ వీడియో వల్ల తాను కూడా చాలా మానసికంగా బాధపడుతున్నట్లు రష్మిక ప్రకటించింది. రష్మిక కి మద్దతుగా తెలుగు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులందరూ ముందుకు వచ్చారు. ఇలాంటి వాటిని అరికట్టాలని, దీనికి సరైన పరిష్కారం చూపించాలంటు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు.

Video Advertisement

అయితే తాజాగా రష్మిక కి జరిగిన ఇబ్బందిని గుర్తించి జర్నలిస్టు సంఘాల వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీనికి పాల్పడిన వారిని పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక్కడి వరకు బానే ఉంది. ఈ తాతంగమంతా చూసి ప్రముఖ తెలుగు సినిమా హీరోయిన్ మాధవి లత స్పందించారు. మాధవి లత గురించి పరిచయం అవసరం లేదు. ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ విషయంతో మీడియా ముందుకు వస్తూ ఉంటారు.

తాజాగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియోను పోస్ట్ చేశారు. రష్మిక వీడియో అంటూ వైరల్ అవుతున్న దానిలో ఆమె వేసుకున్న స్విమ్ సూట్ రష్మిక వేసుకునే డ్రెస్సులు కంటే పెద్ద ఇబ్బందికరంగా ఏమీ లేదని మాధవి లతా అంటున్నారు. పబ్లిక్ ఈవెంట్ లోను, సినిమాలోనూ రష్మిక ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటుంది, అంతకంటే ఘోరంగా ఆ వీడియోలో ఏమీ లేదు అన్నారు. కేవలం ఆ వీడియోలో ఉన్న మనిషికి రష్మికకి సైజు ఒకటే తేడా మిగతా అంతా ఒకటే అంటూ చెప్పుకొచ్చారు.

madhavi latha comments on rashmika

తాను ఆశ్చర్యానికి గురి అయిన విషయం ఏంటంటే రష్మిక కి మద్దతుగా తెలుగు జర్నలిస్ట్ సంఘాల వారు ముందుకు వచ్చారు, మీరు సపోర్ట్ చేయాల్సింది రష్మికాకి కాదు, సమాజంలో చాలామంది ఆడవాళ్లు ఇలాంటి ఘటనలతో ఇబ్బంది పడుతున్నారు,వారికి మీ సపోర్ట్ అందించండి అంటూ చురకలు అంటించారు. ఒక స్టార్ హీరోయిన్ సమస్య ఉందంటే అందరం ముందుకు వచ్చేసి దాన్ని వైరల్ చేస్తున్నారు. రష్మిక….సాయి పల్లవి, సౌందర్యాలాగా పవిత్రంగా ఏ ఉండట్లేదు కదా, మీరు దృష్టి పెట్టాల్సిన సమస్యలు బయట చాలా ఉన్నాయి అంటూ నిర్మొహమాటంగా చెప్పేశారు. మాధవి లత వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అవును తను చెప్పింది నిజమే కదా అంటూ మద్దతు ప్రకటిస్తున్నారు.

 

Also Read:రోజా సెల్వమణి “ప్రేమ కథ” తెలుసా..? వీరి పరిచయం ఎలా మొదలయ్యింది అంటే..?


End of Article

You may also like