తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో జరిగేది ఇదే అంటూ “మాధవి లత” పోస్ట్…ఆ 5 పాయింట్స్ ఏంటంటే.?

తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో జరిగేది ఇదే అంటూ “మాధవి లత” పోస్ట్…ఆ 5 పాయింట్స్ ఏంటంటే.?

by Mounika Singaluri

Ads

నచ్చావులే సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి, తర్వాత ఎన్నో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటి మాధవి లత. గత కొన్ని సంవత్సరాల నుండి మాధవి లత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఎన్నో విషయాలు పై స్పందిస్తూ తన అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంపై కూడా ఆమె కామెంట్ చేసారు.

Video Advertisement

5 ఏళ్ల తర్వాత తెలంగాణ ఇలా ఉంటుంది అంటూ 5 పాయింట్స్ లిస్ట్ చేసారు.
1.. తిండి ఉండదు
2. జాబ్స్ ఉండవు
3. మహిళలకు భద్రత ఉండదు.
4. హిందూ పడగలు ఉండవు.
5. శాంతి ఉండదు

కాంగ్రెస్ పాలనను రావణ సామ్రాజ్యం అంటూ కూడా పోల్చారు మాధవి లత. కాంగ్రెస్ తో పోలిస్తే బీఆర్ఎస్ కి 99 మార్కులు ఇస్తాను అంటూ పోస్ట్ లో వ్యక్తం చేసారు.

https://www.instagram.com/p/C0YlpugJy4o/

మాధవి లత చేసిన ఈ పోస్ట్ పై విభిన్న కామెంట్స్ వస్తున్నాయి. కొందరు సమర్దిస్తుంటే. కొందరు వ్యతిరేకిస్తున్నారు.ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇది ఇలా ఉంటె…తెలంగాణ ఎన్నికల పరిణామం ఎన్నడు ఎవరు ఊహించని విధంగా వచ్చింది. మార్పు కావాలి అంటూ ఒకపక్క అంటూ 6 గ్యారంటీల ఆశ చూపించి అధికారం చేజిక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం గులాబీ వికాసం పై ఇవి ఏవి ప్రభావం చూప లేకపోయాయి. మొత్తం 119 నియోజకవర్గాలలో 64 స్థానాలు కాంగ్రెస్ హస్తగతమయ్యాయి. మరోపక్క గ్రేటర్ పరిధిలో ఉన్న 15 నియోజకవర్గాలలోని ఏడు స్థానాలలో కారు స్పీడ్ కొనసాగింది. కాంగ్రెస్ హై కమాండ్ రేవంత్ రెడ్డిని సీఎం గా ప్రకటించింది. డిసెంబర్ 7 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


End of Article

You may also like