12 లక్షలు అప్పుచేసి ఎమ్మెల్యే గా గెలిచిన వ్యక్తి… ఇంతకీ ఎవరు?

12 లక్షలు అప్పుచేసి ఎమ్మెల్యే గా గెలిచిన వ్యక్తి… ఇంతకీ ఎవరు?

by Mounika Singaluri

Ads

ప్రస్తుత రోజుల్లో ఎమ్మెల్యే అవ్వాలంటే కోట్ల రూపాయలు ఉండాలి. ఎలక్షన్ల సమయంలో లెక్కే లేకుండా ఖర్చు పెడుతూ ఉండాలి. కొంతమంది ప్రతిష్ట కోసం అప్పులు చేసి మరి ఎమ్మెల్యేగా నిలబడి పోటీ చేస్తూ ఉంటారు. డబ్బులు పంచడం ముందు పంచడం చీరలు పంచడం తాయిలాలు ఇస్తూ ఓటర్లను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తారు. అయితే ఉండడానికి ఇల్లు కూడా లేని వ్యక్తి 12 లక్షల అప్పు చేసి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించాడు. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి? అతని వివరాలు ఏంటి?

Video Advertisement

దేశ వ్యాప్తంగా ఉత్కంఠంగా ఎదురుచూసిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ జెండా ఎగరవేసింది. అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌కు కొంత ఊరట లభించింది. ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లో హేమాహేమీలతో తలపడుతూ కొందరు పేద అభ్యర్థులు పోటీకి దిగారు.వారిలో కొందరికి డిపాజిట్ కూడా దక్కకపోయినా. ఒకరు మాత్రం ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నాడు. అతనే మధ్యప్రదేశ్‌కు చెందిన కమలేశ్వర్ దొడియార్.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాంకు చెందిన కమలేశ్వర్ దొడియార్ ఎన్నికల బరిలో నిలిచాడు. అయితే అతని వద్ద ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస డబ్బు లేదు. అత్యంత పేదకుటుంబానికి చెందిన కమలేశ్వర్ 12 లక్షల అప్పు తీసుకున్నాడు. మహామహలు రంగంలో ఉన్న తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి నిలబడ్డాడు. రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు పోలైన ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి హర్ష్ విజయ్ గెహ్లాట్‌పై కమలేశ్వర్ 4618 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. కమలేశ్వర్‌కు 71219 ఓట్లు రాగా, హర్ష్‌కు 66601 ఓట్లు వచ్చాయి. బీజేపీకి చెందిన సంగీతా చారెల్ మూడో స్థానంలో నిలీచాడు. ఇక్కడ మొత్తం 90.08 శాతం ఓటింగ్ జరిగింది.

కమలేశ్వర్ ఒక పూరి గుడిసెలో నివసిస్తున్నాడు. వర్షం కురిస్తే తమ పూరి గుడిసెను టార్పాలిన్‌తో కప్పి వర్షపు నీరు ఇంట్లో పడకుండా లోపల ఉన్నవారు తడవకుండా అవస్థలు పడుతుంటారు. అంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కమలేశ్వర్ ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో దిగాడు. ఎన్నికల కౌంటింగ్ జరిగే సమయంలో సమీప ప్రత్యర్థులకు తనకు మధ్య వ్యత్యాసం పెరుగుతుండడంతో చుట్టుపక్కల ప్రజలు కమలేశ్వర్ అభినందనలు తెలుపుతూనే ఉన్నారు. చివరకు భారీ మెజార్టీటీతో గెలిచి రికార్డు సృష్టించాడు. గెలిచిన తర్వాత
తన గెలుపు పత్రాలను అధికారులకు అందజేయడానికి 300కిపైగా కి.మీ. దూరం బైక్‌పై వెళ్లాడు. తన బావ దగ్గర బైక్ తీసుకుని, దానికి ఎమ్మెల్యే స్టికర్ అతికించుకుని కటిక చలిలో ప్రయాణించాడు.ఎమ్మెల్యే అయిన తర్వాత తొలిసారి రాష్ట్ర రాజధాని పర్యటనకు వెళ్లేందుకు కారును ఏర్పాటు చేయాలని ప్రయత్నించినా అది కుదరలేదని తెలిపారు. భోపాల్ చేరుకున్న తర్వాత ఎమ్మెల్యే రెస్ట్ హౌస్‌లో అతిథిగా బస చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీకి చేరుకుని ప్రవేశ ద్వారం ముందు సాష్టాంగ పడి ప్రజాస్వామ్య దేవాలయానికి నివాళులర్పించారు. అనంతరం అధికారులకు ఎమ్మెల్యేగా తన ధ్రువీకరణ పత్రాలను సమర్పించారు.

33 ఏళ్ల వయసున్న కమలేశ్వర్ భరత్ ఆదివాసీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ఇతని తల్లి సీతాబాయి కూలి పనిచేస్తుంది. అన్నలు,3 అక్కలలో కమలేశ్వర్ చిన్నవాడు. కూలీ కుటుంబానికి చెందిన కమలేశ్వర్ డిగ్రీ చదివిన తర్వాత కోటకు ఉపాధి నిమిత్తం వెళ్ళాడు. ఇంటి నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు.


End of Article

You may also like