గత కొద్ది రోజులుగా తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్ తన రోల్స్ రాయిస్ కార్ ఎంట్రీ పన్ను చెల్లించలేదు అనే విషయంపై చర్చలో నిలిచారు. జడ్జ్ ఎం.సుబ్రహ్మణ్యం, విజయ్ 2012 లో కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ కారు ఎంట్రీ పన్ను చెల్లించలేదు అంటూ ఆర్డర్ పాస్ చేశారు. ఈ కారణంగా విజయ్ పై లక్ష రూపాయల జరిమానా విధించారు. అయితే ఇప్పుడు ఈ కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో విజయ్ పై మధ్యంతర తీర్పును ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు.

vijay rolls royce tax judgement

అయితే విజయ్, తాను పన్ను మొత్తం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను అని, కాకపోతే ఎం.సుబ్రహ్మణ్యం తాను చేసిన అనాలోచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అని అన్నారు అని విజయ్ తరపు సీనియర్ కౌన్సిల్ విజయ్ నారాయణ్ అన్నారు. కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత అప్పీల్ ని  ఆగస్టు 31వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం ట్విట్టర్ లో విజయ అభిమానులు మిస్టర్ పర్ఫెక్ట్ తలపతి విజయ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు.