Ads
భారతదేశం సర్వ మతాలకి నిలయం. హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు కలిసికట్టుగా జీవిస్తూ ఉంటారు. అయితే ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ ఉంటారు. కొందరు మతాలకు అతీతంగా దేవుని పూజిస్తూ ఉంటారు. తాజాగా అయోధ్య రామ మందిరానికి ముస్లిం భక్తులు రావడం ఇందుకు నిదర్శనం.
Video Advertisement
తాజాగా హిందూ ఆలయాల్లోకి అన్య మతస్తుల ప్రవేశం పైన మద్రాస్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అసలు విషయంలోకి…అరుల్మిగు పళని దండాయుతపాణి స్వామి ఆలయం, దాని ఉప ఆలయాల్లోకి హిందువులను మాత్రమే అనుమతించేలా ప్రతివాదులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డి సెంథిల్‌కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టిన మధురై బెంచ్ అన్యమతస్థుల ప్రవేశంపై ఆలయ ప్రవేశ ద్వారం, ధ్వజస్తంభం దగ్గర, మందిరంలోని ప్రముఖ ప్రదేశాల్లో ‘హిందూయేతరులను అనుమతించరు’ అనే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా తమిళనాడు ప్రభుత్వం తరఫున పర్యాటక, సాంస్కృతిక, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, పళని ఆలయ కార్యనిర్వాహక అధికారిని చేర్చింది.
హిందూ విశ్వాసాలు నమ్మని వారిని ఆలయాల్లోకి అనుమతించవద్దని కోర్టు సూచించింది.ఎవరైనా హిందుయేతరులు ఆలయంలోకి వస్తామని కోరితే దేవతపై విశ్వాసం, హిందూ మతం ఆచారాలు, సంప్రదాయాలను అనుసరిస్తానని…ఆలయ ఆచారాలకు కూడా కట్టుబడి ఉంటాననే హామీని వారి నుండి పొందాలి. అటువంటి హామీతో హిందుయేతరులను ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించవచ్చు అని కోర్టు తీర్పు చెప్పింది.అలాగే అటువంటి వ్యక్తులను అనుమతించే సమయంలో ఆలయ రిజిస్టర్‌లో పేరు నమోదు చేయాలని స్పష్టం చేసింది.
అయితే ఈ పిటిషన్ పళని దేవాలయానికి మాత్రమే దాఖలు చేయడంతో కోర్టు ఉత్తర్వులు దానికి మాత్రమే పరిమితం కావచ్చని ప్రతివాదులు చేసిన వాదనను తోసిపుచ్చింది. లేవనెత్తిన అంశం పెద్ద సమస్య.ఇది అన్ని హిందూ దేవాలయాలకు వర్తించాలి,కాబట్టి ప్రతివాదుల అభ్యర్థన తిరస్కరించాం…ఈ ఆంక్షలు వివిధ మతాల మధ్య మత సామరస్యాన్ని,సమాజంలో శాంతిని నెలకొల్పుతాయి అని కోర్టు తెలిపింది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌ఆర్ అండ్ సీఈ విభాగం, ఆలయ నిర్వహణలో పాలుపంచుకున్న వ్యక్తులందరూ అన్ని హిందూ దేవాలయాలకు ఈ ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది.
End of Article