Ads
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా దర్శకులు, నిర్మాతలు తమ సినిమాలని థియేటర్లలో విడుదల చేయడానికి కొంచెం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎంత లాక్ డౌన్ తీసేసినా కూడా ప్రేక్షకులు అందరూ మళ్ళీ సినిమా థియేటర్లలోకి వస్తారు అనే గ్యారెంటీ లేదు. దాంతో చాలా మంది తమ సినిమాలని డిజిటల్ రిలీజ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరొక సినిమా కూడా చేరనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.
Video Advertisement
నితిన్ హీరోగా రాబోతున్న మాస్ట్రో సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా జూన్ 11వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. అయితే మాస్ట్రో సినిమా బృందం ఈ సినిమాని డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయంపై ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ + హాట్ స్టార్ తో చర్చలు జరుపుతున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
End of Article