కరోనా కి అందరు సమానులే …చిన్న పెద్ద కులం మాత్రం వుందంటా . కరోనా ఆడవారిపై కంటే మగవారిపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుంది అంటా .నిపుణులు ఆడవారికి ఎంత మందికి సోకింది మగవారికి ఎంతమందికి సోకింది అనే డేటాపై ఆరతియ్యగా స్త్రీల కంటే మగవారిపై దీని ప్రభావం ఎక్కువగా వుంది అని తెలిసింది .

.పురుషులు ఆడవారిలో మరణాల సంఖ్య డాటాను పరిశీలించగా ఆడవారికంటే మగవారిపై ఈ వ్యాధి ఎక్కువగా ప్రభావం చూపుతుంది అని డేటా తెలిపింది . ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటిదాకా మరణించిన వారిలో ఆడవారితో పోలిస్తే మగవారే ఈ వ్యాధి బారిన పడినవారు ఎక్కువ అని నమూనాలు తెలుపుతున్నాయి.

కరోనావైరస్ వ్యాప్తి ఇంకా ప్రారంభ దశలోనే ఉండగా.. ఇటలీ, చైనా, జర్మనీ, స్పెయిన్, ఇరాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, పోర్చుగల్, డెన్మార్క్ మరియు స్వీడన్‌లలో వైరస్ బారిన పడి మరణించిన వారిలో పురుషులే ఎక్కువగా ఉన్నారు.

హృదయ సంబంధిత రోగాలు సామాన్యంగానే ఆడవారి కంటే పురుషులలో ఎక్కువగా ఉండడం.పొగత్రాగే వారు కూడా ఆడవారిలో కంటే మగవారిలో ఎక్కువ ఉండడం దీనికి కారణం కావచ్చు కానీ దీనికి ప్రత్యేకమైన కారణాలు ఏమి ఇప్పటికి శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఏమి చెప్పలేకపోతున్నారు ..ఈ అలవాట్లే మగవారిలో ఎక్కువ మరణాలకు కారణం అని చెప్తున్నారు …కరోనా మొదలైన దేశంలో మగవారి మరణాల రేట్ 2.8 శాతం ఉండగా ఆడవారి మరణాల రేట్ 1.7 మాత్రమే ..కరోనా బారినపడి మరణించిన వారు చైనాలో 68 శాతం మగవారు మరియు ఇటలీలో 71 శాతం వున్నారు .

 

అంతేకాకుండా స్వతహాగా పరిశుభ్రత , వైద్యుల సలహాలు కచ్చితంగా పాటించే గుణం మగవారికంటే ఆడవారిలో ఎక్కువగా ఉండడం వల్లనే ఆడవారు ఈ వ్యాధిబారిన తక్కువగా పడుతున్నారు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

Sharing is Caring:
No more articles