Ads
చిత్రం : మహా సముద్రం
Video Advertisement
నటీనటులు : శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అనూ ఇమాన్యుల్, జగపతి బాబు, రావు రమేష్.
నిర్మాత : రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం : అజయ్ భూపతి
సంగీతం : చైతన్ భరద్వాజ్
విడుదల తేదీ : అక్టోబర్ 14, 2021
మహా సముద్రం రివ్యూ:
2017 విశాఖపట్నంలో సినిమా మొదలవుతుంది. అర్జున్ (శర్వానంద్) జాబ్ ట్రైల్స్ లో ఉంటాడు. అర్జున్ గర్ల్ ఫ్రెండ్ స్మిత (అనూ ఇమాన్యుల్) లా స్టూడెంట్. అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ విజయ్ (సిద్ధార్థ్) పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. సిద్ధార్థ్ ప్రేమించిన అమ్మాయి (మహా) అదితి రావు హైదరి ఒక డాన్స్ టీచర్. కొన్ని అనుకోని సంఘటనల వల్ల విజయ్ విశాఖపట్నం వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత కథలో ఊహించని ట్విస్ట్ ఉంటుంది. అర్జున్, చుంచు మామ (జగపతి బాబు)తో కలిసి స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. లా ప్రాక్టీస్ చేస్తున్న స్మిత మళ్లీ అర్జున్ జీవితంలోకి కి వస్తుంది. విశాఖపట్నం వదిలేసి వెళ్ళిపోయిన విజయ్ కూడా మళ్ళీ తిరిగి వస్తాడు. అర్జున్ కి, విజయ్ కి మధ్య గొడవ మొదలవుతుంది. అసలు వాళ్ళిద్దరికీ గొడవ ఎందుకు వచ్చింది? మహా పరిస్థితి ఏంటి? మహాకి ఏం జరిగింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
దర్శకుడు అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆ సినిమా కూడా ఒక రొమాంటిక్ క్రైమ్ స్టోరీ లాగా సాగుతుంది. మహా సముద్రం కూడా దగ్గర దగ్గర అదే జానర్ కి చెందిన సినిమా. దాదాపు 8 సంవత్సరాల తర్వాత సిద్ధార్థ్ ఈ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే, ముందు నుంచి చెప్పినట్టుగా సిద్ధార్థ్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించినా కూడా, ప్రాధాన్యత ఉన్న పాత్ర మాత్రం శర్వానంద్ ది ఏమో అనిపిస్తుంది. కానీ దర్శకుడు ఇద్దరు హీరోలని సమానంగా స్క్రీన్ మీద చూపించడానికి ప్రయత్నించారు. పర్ఫామెన్స్ ల విషయానికి వస్తే నటీనటులందరూ తమ పాత్రల్లో బాగా నటించారు. కానీ కథ పరంగా మాత్రం సినిమాలో ఉన్న పాత్రల నటనకు న్యాయం జరగలేదు ఏమో అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు మనకి రాబోయే ట్విస్ట్ కూడా సులభంగా అర్థమైపోతుంది. కథలో కొత్తదనం తగ్గింది. ఇలాంటి సినిమాలు మనం అంతకు ముందు చాలా చూశాం. చైతన్ భరద్వాజ్ అందించిన పాటలు, సినిమాటోగ్రఫీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
నటీనటుల పెర్ఫార్మెన్స్
పాటలు
మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్టోరీ
ముందే అర్థమయ్యే ట్విస్ట్ లు
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
సినిమాలో నటీనటులు బాగా నటించినా, పాటలు బాగున్నా కూడా మనకి తెలిసిన కథే కావడంతో మహా సముద్రం ఒక యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
End of Article