చనిపోయేముందు లెటర్ లో ఆ పంచాయతీ కార్యదర్శి ఏం రాసారో తెలుసా? కంటతడిపెట్టించే ఘటన!

చనిపోయేముందు లెటర్ లో ఆ పంచాయతీ కార్యదర్శి ఏం రాసారో తెలుసా? కంటతడిపెట్టించే ఘటన!

by Megha Varna

నేను తీసుకున్న ఈ నిర్ణయంతో ఏ ఒక్కరికి సంబంధం లేదు ..కుటుంబ సభ్యులు ,స్నేహితులను ఇబ్బంది పెట్టోదు. ఈ ఉద్యోగ జీవితం గడపడం ఇష్టంలేకే నేను చనిపోతున్న ..నా మృతదేహానికి పోస్టుమార్టం చెయ్యకుండా నా అవయవాలను ఇతరులకు దానం చేయండి” అంటూ ఆత్మహత్య లేఖ రాసి ఓ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్నాడు ..సాక్షి కధనం ప్రకారం…మెహబూబ్ నగర్ లోని మార్లులో నివాసం ఉంటున్నఅరుణ్ చంద్ర అనే   25 యేళ్ల పంచాయతీ కార్యదర్శి  గురువారం ఉదయాన్నే ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు ..

Video Advertisement

పొద్దునే 6 :30 గంటల ప్రాంతంలో గదిలో ఫ్యాన్ కు ఉరేసుకున్న తమ్ముడిని చుసిన ఫణేంద్రబాబు చాలా గట్టిగ అరవడంతో కుటుంబ సభ్యులు ,చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు అరుణ్ చంద్ర గది వద్దకు చేరుకొని తలుపు బద్దలుకొట్టి ఫ్యాన్ కు వేళ్ళాడుతున్న అరుణ్ చంద్రను కిందకి దించి ట్రీట్మెంట్ కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు ..అయితే అరుణ్ చంద్రను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెంది చాలాసేపు అయ్యిందని నిర్దారించారు .అరుంచంద్ర కొద్దికాలంగా హన్వాడ మండలం యూరోనిపల్లిలో పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వర్తిస్తున్నాడు .

 

కాగా సర్పంచ్ సుధారాణి భర్త అనంతరెడ్డి ,వార్డుసభ్యుడు తిరుపతయ్య ఆరునెలలుగా వేధించడంతో పాటు తన ఉద్యొగ జీవితంలో ఇబ్బందులు తీసుకురావడంతో మనో వేదనకు గురి అయ్యి నా కుమారుడు ఆత్మహత్య కు పాల్పడ్డాడని తండ్రి వెంకటేశ్వర రావు పోలీసులకు పిర్యాదు చేసారు .ఏప్రిల్ 25 నుంచి మే 1 వ తేదీ వరకు డ్యూటీ కి వెళ్లడం లేదని ,దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపారు .ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేసినట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు ..

యూరోనిపల్లి పంచాయతీ కార్యదర్శి అరుణ్ చంద్ర ఆత్మహత్య వెనక తీవ్రమైన మానసిక వేదన ఉందని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తెలిపారు ..గ్రామంలో రెండు వర్గాలు నిత్యం ఒత్తిళ్లకు గురిచేయడంతో పాటు సర్పంచ్ మరియు వార్డ్ సభ్యులు ఇబ్బంది పెట్టడంవలనే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు .కాగా సదరు సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు .

source: sakshi


You may also like

Leave a Comment