Ads
సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి అమ్మవారుగా భవిష్యవాణి పలికిన స్వర్ణలత దేవి గారు మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబం అమ్మవారికి ఆరు తరాలుగా సేవలు చేస్తున్నారని దాదాపు 30 ఏళ్ల నుండి స్వయంగా ఆమె అమ్మవారికి సేవలు చేస్తున్నానని ఇప్పటివరకు అమ్మవారికి జరిగిన బోనాల పండగలలో అతి తక్కువమంది భక్తులు వచ్చింది ఈ సంవత్సరమేనని ఆమె బాధపడ్డారు.
Video Advertisement

అమ్మవారు పూనినప్పుడు ఆమె కళ్ళలో నీరు ఎందుకు వచ్చాయని మీడియా అడిగినప్పుడు అందుకు స్వర్ణలత దేవి అమ్మవారు కూడా ఈసారి బోనాల పై అసంతృప్తిగా ఉన్నారు.భక్తులకు బాధ కలిగినందుకు అమ్మవారు అలా బాధపడడం ద్వారా కళ్ళలో కన్నీరు కారి ఉంటాయని ఆమె అన్నారు.

ఈసారి భవిష్యవాణిలో అమ్మవారు ఎవరు చేసుకున్నది వారు అనుభవించక తప్పదు. కరోనాపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.భక్తి భావనతో ఐదు వారాలు శాక పోసి, యజ్ఞాలు చేయించండి.నా ప్రజలందరినీ కాపాడుకుంటాను అలాగే వారిని సుఖసంతోషాలతో చూస్తానని మాటిస్తున్నాను. గంగాదేవికి జలాలతో అభిషేకం, బోనం చేయండి అని అన్నారు.
End of Article
