Ads
ఇటీవల కాలంలో పురుషులను పురుషులు, మహిళలను మహిళలు ప్రేమించుకోవడం, పెళ్లిళ్లు చేసుకుంటున్న సంఘటనల పై వార్తలు రావడం చూస్తూనే ఉన్నాము. వీరిలో ప్రేమించినవారిని పెళ్లి చేసుకోవడం కోసం లింగ మార్పిడి చేసుకున్నవారు ఉన్నారు.
Video Advertisement
కొందరు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటున్నారు. కొందరు పెద్దలు ప్రకృతికి విరుద్దంగా జరుగే అంగీకరిచడంలేదు. అలాంటి స్థితిలో వారిని ఎదురించి పెళ్లి చేసుకుంటున్న వారు కొందరు. ఈ క్రమంలో ఒక మహిళ పురుషుడిగా మారి, మహిళను చేసున్నారు. తాజాగా ఓ బిడ్డకు తండ్రిగా మారిన వార్త వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మహారాష్ట్రకు బీద్ జిల్లా రాజేగాన్ గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్ లలితా సాల్వే 1988 లో జన్మించింది. ఆమె 2010 లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఉద్యోగానికి సెలెక్ట్ అయింది. అయితే లలితా సాల్వేకి 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమె శరీరంలో పలు మార్పులు రావడాన్నిఆమె గుర్తించింది. దాంతో హాస్పటల్ వెళ్లి మెడికల్ టెస్ట్‌లు అన్ని చేయించుకోగా, అసలు సంగతి బయటికి వచ్చింది.
ఆమె శరీరంలో పురుషులలో ఉండే వై క్రోమోజోమ్‌లు ఉన్నాయని తేలింది. దాంతో లలిత జెండర్ డిస్ఫోరియా ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. వారి సూచనతో లింగ మార్పిడి సర్జరీ చేయించుకుని పురుషుడిగా మారింది. లింగ మార్పిడి వల్ల తన ఉద్యోగానికి ఇబ్బంది రాకుండా 2017లో గవర్నమెంట్ ను, బాంబే హైకోర్టును లలిత ఆశ్రయించింది. లింగమార్పిడి సర్జరీ కోసం నెల రోజులు సెలవు కోరింది. దీంతో బాంబే హైకోర్టు మరియు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అలా లింగమార్పిడి సర్జరీ చేయించుకుంది.
2018 – 2020 వరకు మూడు సర్జరీలు చేయించుకుని పురుషుడిగా మారింది. ఆ తరువాత లలిత్ కుమార్ సాల్వేగా పేరు మార్చుకుంది. 2020లో లలిత్ కుమార్ సాల్వే ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన సీమాను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు పెళ్లి అయిన నాలుగేళ్ల అనంతరం, జనవరి 15న మగబిడ్డ జన్మించాడు. తనకు మగబిడ్డ జన్మించడంతో లలిత్ కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు, ఒడిదుడుకుల గురించి తెలిపాడు.
@AP @AFP @tass_agency @ReutersIndia@ReutersTV @FRANCE24 @CNN@euronews #India -Lalita Salve done Sex Change Surgery now He is Lalit Salve & married with women in Maharashtra, India
He is Policeman and had battled against government system for his Surgery#Buddhism pic.twitter.com/SdP95wZFNu— Mandar D (@MadDeshpande) February 18, 2020
Also Read: అయోధ్య వేడుకలో ఇదే వెలితి… రామమందిరం కోసం ఎంతో కష్టపడ్డారు..కానీ అద్వానీ గారు ఇప్పుడు ఎందుకు రాలేదు?
End of Article