Ads
స్వతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ జ్ఞాపకార్థం యునైటెడ్ కింగ్డమ్ ట్రెజరీ మహాత్మా గాంధీ నాణాన్ని ముద్రించడానికి నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని శనివారం ప్రకటించారు. 1987 నుండి భారత కరెన్సీపై మహాత్మా గాంధీ ఉన్నారు. యునైటెడ్ కింగ్డమ్ వారు ముద్రిస్తున్న తొలి నాన్ వైట్ వ్యక్తి మహాత్మా గాంధీ.
Video Advertisement
నాణం రూపొందించే బాధ్యతను రాయల్ మింట్ అడ్వైజరీ కమిటీ కి అప్పగించారు. బ్లాక్, ఆసియన్ అండ్ మైనారిటీ ఎత్నిక్ (BAME) ఛాన్స్లర్ రిషి సునక్ “మహాత్మా గాంధీ కాంట్రిబ్యూషన్ ని బ్రిటన్ కూడా గుర్తించాలి” అని అన్నారు.
వి టూ బిల్ట్ బ్రిటన్ అనే క్యాంపెయిన్ నిర్వహిస్తున్న మాజీ కన్సర్వేటివ్ క్యాండిడేట్ జెహ్రా జైదీ కి రిషి సునక్ రాసిన లేఖలో “యునైటెడ్ కింగ్డమ్ చరిత్రలో బ్లాక్, ఆసియన్ అండ్ మైనారిటీ వ్యక్తులు కూడా ఎంతో సహకారాన్ని అందించారు.
మనం నిర్మించిన ఈ దేశం కోసం మైనారిటీ వర్గాలు ఎన్నో తరాల వరకు పోరాడారు. దాంతో పిల్లలకు చదువు నేర్పించి, అవసరమైన వారికి వైద్యం అందించాం. వాళ్ల ప్రోత్సాహం తో బిజినెస్ రంగాల్లో, ఉద్యోగ రంగాల్లో, అభివృద్ధి రంగంలో కూడా ముందుకు దూసుకెళ్లాం” అని లేఖలో పేర్కొన్నారు.
నాణేలు రూపొందించడానికి సలహా ఇచ్చే నిపుణులతో రూపొందించిన ఇండిపెండెంట్ కమిటీ రాయల్ మింట్ అడ్వైజరీ కమిటీ. రిషి సునక్ మాట్లాడుతూ “నేను ఇవాళ రాయల్ మింట్ అడ్వైజరీ కమిటీ (ఆర్‌ఎంఏసి) ఛైర్, లార్డ్ వాల్డెగ్రేవ్ కు ఒక లేఖ రాశాను. బ్లాక్, ఏషియన్ మరియు ఇతర మైనారిటీ వ్యక్తుల సహకారాన్ని గుర్తించాలి. వాళ్ళు మనకి చేసిన సహాయం భావి తరాలకి కూడా తెలియాలి అని ఆ లేఖ ద్వారా ఆర్‌ఎంఏసి సబ్ కమిటీ యొక్క థీమ్స్ ని కోరాను” అని అన్నారు.
End of Article