“మహేష్ బాబు” మాటల అర్ధమే మార్చేసిన బాలీవుడ్ మీడియా..! అసలు ఏం అన్నారంటే..?

“మహేష్ బాబు” మాటల అర్ధమే మార్చేసిన బాలీవుడ్ మీడియా..! అసలు ఏం అన్నారంటే..?

by Mohana Priya

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా మహేష్ బాబు మేజర్ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

Video Advertisement

ఈ సినిమాలో అడవి శేష్ హీరోగా నటించారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదల అయ్యింది. తెలుగులో ఈ సినిమా ట్రైలర్ మహేష్ బాబు, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్ విడుదల చేశారు. ట్రైలర్ విడుదల సందర్భంగా జరిగిన ఈవెంట్ లో సినిమా బృందంతో పాటు మహేష్ బాబు కూడా మీడియాతో మాట్లాడారు. కేవలం తెలుగు మీడియా మాత్రమే కాకుండా బాలీవుడ్ మీడియా కూడా ఈ ఈవెంట్ లో పాల్గొని సినిమా బృందాన్ని ప్రశ్నలు అడిగారు.

mahesh babu

ఇందులో ఒక బాలీవుడ్ రిపోర్టర్ మహేష్ బాబుని ఒక ప్రశ్న అడిగారు. “తెలుగులో మీరు చాలా పెద్ద స్టార్ బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించే అవకాశం ఉందా?” అని ఆ రిపోర్టర్ అడిగారు. అందుకు మహేష్ బాబు, ” బాలీవుడ్ వాళ్ళు నన్ను భరించలేరు. నిజంగా చెప్పాలంటే బాలీవుడ్ నుంచి నాకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ తెలుగు సినిమా చేయాలి. అదే అక్కడి వరకు వెళ్ళాలి.” అని అన్నారు. కానీ దీనిపై కొంత నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతోంది. ఇక్కడ అర్ధం ఒకటైతే మరొక రకంగా ఈ వార్త వైరల్ అవుతోంది.

Why did Mahesh Babu stay away from remakes

మహేష్ బాబు అన్న మాట సరైనది కాదు అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. దాంతో కొంత మంది, ” మహేష్ బాబు ఇక్కడ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో ఒకరు. అలాంటి హీరో కి బాలీవుడ్ కి వెళ్తే అంత రెమ్యూనరేషన్ వచ్చే అవకాశం ఉండదు. అందుకు కారణం బాలీవుడ్ లో కూడా చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. దాంతో ఒక ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిన వ్యక్తి మరొక ఇండస్ట్రీలోకి వెళ్లి మళ్లీ ఒక నార్మల్ హీరోగా సినిమాలు చేయడం అంటే కొంచెం కష్టమైన విషయమే. దాంతో ఈ ఉద్దేశంతో మహేష్ బాబు ఆ మాట అన్నారు” అని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

watch video :


End of Article

You may also like