సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ఇటీవల సింగరేణిలో జరిగిన ఘటన గురించి మాట్లాడారు. మహేష్ బాబు ఈ విధంగా రాశారు. “సింగరేణి కాలనీలో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన ఘోరమైన నేరం మనం సమాజంలో ఎంతగా దిగజారిపోయామో గుర్తు చేస్తుంది. “మా కూతుళ్లు సురక్షితంగా ఉంటారా?” అనేది ఎప్పటికీ ఒక ప్రశ్నలాగా మిగిలిపోయింది. ఇది నిజంగా దారుణం .. ఆ కుటుంబం ఎలా ఉన్నారో ఊహించలేకపోతున్నాను!” అని అన్నారు.

mahesh babu comments on singareni incident

వీలైనంత తొందరగా చర్య తీసుకొని ఆ చిన్నారికి మరియు ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని నేను అధికారులని కోరుతున్నాను అని రాశారు మహేష్ బాబు. మహేష్ బాబు మాత్రమే కాకుండా మంచు మనోజ్ ఇంకా ఇతర ప్రముఖులు ఈ ఘటనపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.