జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి హోస్ట్ గా మన ముందుకు వచ్చారు. జెమినీ టీవీలో టెలికాస్ట్ అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రోగ్రామ్ కూడా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.

Video Advertisement

అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రాం మొదలయ్యింది. ఈ ప్రోగ్రాం మొదలైనప్పటి నుంచి కూడా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే, ఈ ప్రోగ్రాంకి మహేష్ బాబు అతిథిగా రాబోతున్నారు అనే వార్త ఎప్పుడో బయటికి వచ్చింది. ఆ ఎపిసోడ్ షూటింగ్ కి సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

mahesh babu evaru meelo koteeswarulu telecast date

దాంతో మహేష్ బాబు ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జెమినీ టీవీ బృందం ఇటీవల మహేష్ బాబు ఎపిసోడ్ త్వరలో రాబోతోంది అని ఒక ప్రోమో విడుదల చేసింది. అందులో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ సరదాగా మాట్లాడుకోవడం మన ప్రోమోలో చూడొచ్చు. ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది అని ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలయ్యింది. ఈ ఎపిసోడ్ వచ్చే ఆదివారం 8:30 కి ప్రసారం అవ్వబోతున్నట్టు జెమినీ టీవీ బృందం ప్రకటించింది. అలాగే ఒక స్పెషల్ ప్రోమో కూడా విడుదల చేసింది.  దాంతో ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

watch video :