వైరల్ అవుతున్న “మహేష్ బాబు” ఫ్యామిలీ ఫోటో వెనకున్న అసలు కథ ఇదే.!

వైరల్ అవుతున్న “మహేష్ బాబు” ఫ్యామిలీ ఫోటో వెనకున్న అసలు కథ ఇదే.!

by Mohana Priya

Ads

సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబం లో ఇటీవల గెట్ టుగెదర్ జరిగింది. అందుకు కారణం మహేష్ బాబు సోదరి, సుధీర్ బాబు భార్య అయిన పద్మిని ప్రియదర్శిని పుట్టినరోజు. ఈ సందర్భంగా పద్మిని ప్రియదర్శిని పుట్టినరోజు వేడుకలలో సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ బాబు తల్లి ఇందిర గారు, మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్, మంజుల, సంజయ్ స్వరూప్ (మంజుల భర్త), టిడిపి ఎంపీ గల్లా జయదేవ్, మహేష్ బాబు పెదనాన్న ఆదిశేషగిరి రావు గారు పాల్గొన్నారు.

Video Advertisement

ఈ ఫోటోలను సుధీర్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. అందరూ కలిసి దిగిన ఒక ఫ్యామిలీ ఫోటో, భోజనం చేస్తున్న ఫోటో, కృష్ణ గారు కారులో వెళ్తుంటే అందరూ బై (bye) చెప్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నెటిజన్లు కూడా పద్మిని ప్రియదర్శని కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఫోటోలో మహేష్ బాబు లుక్ కొత్తగా ఉంది. సర్కారు వారి పాట సినిమా కోసమే ఈ లుక్ అనేది ఈ పాటికే చాలా మందికి తెలిసే ఉంటుంది.

అయితే సర్కారు వారి పాట షూటింగ్ నవంబర్ లో మొదలవబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.


End of Article

You may also like