Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్ లో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా, డిఫరెంట్ గా కనిపిస్తున్నారు.
Video Advertisement
ఈ సినిమాకి సోలో, గీతగోవిందం సినిమాలకు దర్శకత్వం వహించిన పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ లో మహేష్ బాబు, హీరోయిన్ కీర్తి సురేష్ తో పాటు, వెన్నెల కిషోర్ కూడా కనిపించారు. సినిమాకి సంధించిన షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా షూటింగ్‌కి కొంచెం బ్రేక్ పడింది. మళ్లీ త్వరలో షూటింగ్ మొదలవుతుంది అని సమాచారం.
సర్కారు వారి పాట సినిమా ఏప్రిల్‌లో విడుదల అవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా, అలాగే ఆర్ఆర్ఆర్ విడుదల కూడా మార్చ్, ఏప్రిల్‌లో ఉండడంతో సినిమా బృందం సినిమా మళ్లీ విడుదలని వాయిదా వేశారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా మేలో విడుదల అవుతున్నట్టు సినిమా బృందం ప్రకటించింది. అంతకు ముందు మహేష్ బాబు నటించిన కొన్ని సినిమాలు మేలో విడుదల అయ్యాయి. నాని, బ్రహ్మోత్సవం సినిమాలు మేలో విడుదల అయ్యాయి. ఆ సినిమాలు ఆశించిన ఫలితాన్ని పొందలేదు. దాంతో మే అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఒక సెంటిమెంట్ ఏర్పడింది.
అంతే కాకుండా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కీర్తి సురేష్ నటించిన గత సినిమాలు కూడా అంత మంచి పేరు ఏం సంపాదించలేదు. దాంతో ఫ్యాన్స్ కి ఇంకా భయం పెరిగింది. కానీ ఒకసారి గమనిస్తే మహేష్ బాబు నటించిన మహర్షి కూడా మే లోనే విడుదల అయ్యింది. ఏదేమైనా ఫ్యాన్స్ మాత్రం రిలీజ్ డేట్ మళ్లీ మారితే బాగుంటుంది అని అనుకుంటున్నారు.
End of Article