గుంటూరు కారం సినిమాకి మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

గుంటూరు కారం సినిమాకి మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

by Mohana Priya

Ads

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న గుంటూరు కారం సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తోంది. ఇప్పుడు సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది.

Video Advertisement

అయితే సినిమాలో చాలా మార్పులు జరిగాయి. ఎన్ని మార్పులు జరిగినా కూడా సమయానికి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త ప్రచారంలో ఉంది. సినిమాకి మహేష్ బాబు భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాకి మహేష్ బాబు 78 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట.

mahesh-babu-rare-record2

ప్రస్తుతం మహేష్ బాబుకి ఉన్న మార్కెట్ వాల్యూని దృష్టిలో పెట్టుకొని రెమ్యూనరేషన్ తీసుకున్నారు. మహేష్ బాబు ఈ సినిమా కోసం తనని తాను మార్చుకున్నారు అని అర్థం అవుతోంది. పాటల్లో కూడా డాన్స్ పరంగా చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఏ సినిమా చేయబోతున్నారు అనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు.

ఇప్పటికే రాజమౌళి సినిమాకి సంబంధించి మహేష్ బాబు కసరత్తులు చేస్తున్నారు. ఇది ఇండియానా జోన్స్ లాగా ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమా అని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ ఏజెన్సీలని, హాలీవుడ్ నటులని తీసుకుంటారు. మహేష్ బాబు ఈ సినిమా కోసం ఒక స్పెషల్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకోబోతున్నారు. సినిమా మొత్తం ఫైటింగ్ నేపథ్యంలో ఉంటుంది కాబట్టి మహేష్ బాబు ఫిట్ నెస్ కూడా బాగా మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా కూడా భాగాలుగా వస్తుంది అనే వార్త వచ్చింది.


End of Article

You may also like