Ads
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన “సరిలేరు నీకెవ్వరు” చిత్రంతో ఘన విజయాన్ని నమోదు చేసుకున్నారు హీరో మహేష్ బాబు.కాగా మహేష్ బాబు తదుపరి “సర్కారు వారి పాట” అనే చిత్రంలో నటిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.అయితే ఈ చిత్రాన్ని “సోలో”,”గీత గోవిందం” లాంటి ప్రేమ కథ చిత్రాలను తెరకెక్కించిన పరుశురాం దర్శకత్వం వహించడం విశేషం.అయితే “సర్కార్ వారి పాట” చిత్రంలో మహేష్ బాబుకు ప్రతినాయకుడిగా ఒక స్టార్ హీరో నటించబోతున్నారు అంటూ కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.ఆ వివరాలేంటో చూద్దాం ..
Video Advertisement
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు లాగా కాకుండా ఓ వైవిధమైన కధాంశంతో పరుశురాం “సర్కార్ వారి పాట” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తుంది.అయితే “సర్కార్ వారి పాట” చిత్రంలో మహేష్ బాబు మూడు విభిన్న పాత్రలలో కనిపించునున్నారని సమాచారం.కాగా ఈ చిత్రాన్ని ప్యాన్ఇం డియా లెవెల్ లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.అయితే “సర్కార్ వారి పాట” చిత్రంలో విలన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉండడం వలన మహేష్ బాబు కు సరిపోయే విలన్ ను వెతికే పనిలో చిత్రబృందం బిజిగా ఉన్నట్లు తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం మొదటగా ఉపేంద్ర ను సంప్రదించారట చిత్రబృందం.
కాకపోతే ఉపేంద్ర వరస సినిమాలతో బిజిగా ఉండడం వలన సర్కారు వారి పాట చిత్రానికి నో చెప్పేసారు.అయితే “ఈగ” చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన కన్నడ నటుడు సుదీప్ ను సంప్రదించారట “సర్కార్ వారి పాట” చిత్ర బృందం.అయితే సుదీప్ కూడా బాగా బిజిగా ఉన్నప్పటికీ “సర్కారు వారి పాట” కథ బాగా నచ్చడంతో వేరే సినిమాల డేట్స్ ఈ చిత్రానికి ఇచ్చారంట.కాకపోతే తన సీన్స్ అన్నీకూడా త్వరగా కంప్లీట్ చేసెయ్యాలి అనే కండిషన్ సుదీప్ పెట్టినట్లుగా తెలుస్తుంది .కాగా సుదీప్ కండిషన్ కు చిత్రబృందం ఒప్పుకున్నారని తెలుస్తుంది.
End of Article