ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తనదైన పంచులతో నవ్విస్తుంటాడు. మహేశ్‌ కామెడీ చేశాడంటే పగలబడి నవ్వాల్సిందే. ఖలేజా, దూకుడు, సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ తనలోని కామెడీ యాంగిల్‌ను బయటకు తీసి కడుపుబ్బా నవ్వించారు.ఇక నిజ జీవితంలోనూ​ నవ్విస్తుంటాడు.

Video Advertisement

ఇటీవల ఓ ఎయిర్‌పోర్ట్‌లో తనను ఫోటో తీస్తున్న ఒక అభిమానిని తనదైన కామెడీ డైలాగ్‌తో నవ్వించేశాడు. ఎయిర్‌పోర్ట్‌లో నుంచి వస్తున్న మహేశ్‌ను ఒక అభిమాని కెమెరాలో ఫోటోలు తీస్తున్నాడు. మహేశ్‌ కారు దిగి నడిచి వస్తున్నంత సేపు ఫోటోలు తీస్తూనే ఉన్నాడు. ఇది గమనించిన మహేశ్‌.. ‘ఆపమ్మా ఆపు.. నీకు బోరు కొట్టట్లేదా.. ఎప్పుడూ ఇదే పనా’ అంటూ తనదైన కామెడీ డైలాగ్‌తో అతన్ని ఆపాడు. మహేశ్‌ మాటలకు అక్కడి సిబ్బందితో పాటు ఆ కెమెరామెన్‌ కూడా గొల్లున నవ్వారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.