PRABHAS: మహేష్ రికమెండ్ చేస్తే…”ప్రభాస్” నటించిన సినిమా ఏదో తెలుసా.?

PRABHAS: మహేష్ రికమెండ్ చేస్తే…”ప్రభాస్” నటించిన సినిమా ఏదో తెలుసా.?

by Mounika Singaluri

Ads

ఒక సినిమా తెర మీదకు రావాలంటే వెనుక చాలా కష్టం ఉంటుంది. ముందు కథ రాసుకొని అది ఏ హీరోకి సరిపోతుందో అని వెతుక్కోవాలి. తీరా ఆ హీరో దగ్గరికి వెళ్లి కథ చెప్పిన తర్వాత తనకి ఆ సినిమా చేయాలి అనిపించకపోయి ఉండొచ్చు. దానికి కారణం ఆ క్యారెక్టర్ లో తనని తాను ఊహించుకోకపోవడం లేకపోతే ఒకవేళ కథ నచ్చినా సరే డేట్స్ సరిపోకపోవడం లాంటివి జరుగుతూ ఆ హీరోలు సినిమాను ఒప్పుకోకపోయి ఉండొచ్చు.

Video Advertisement

కానీ కొంతమంది హీరోలు మాత్రం ఈ సినిమాలో తను సెట్ అవ్వడని ఈ క్యారెక్టర్ ఇంకొక హీరోకి అయితే బాగుంటుంది అని చెప్పి సజెషన్స్ ఇస్తూ ఉంటారు. అయితే మహేష్ బాబు విషయంలో కూడా అదే జరిగింది. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కోసం ఫస్ట్ డైరెక్టర్ దశరథ్, ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇద్దరు వెళ్లి మహేష్ బాబుకు కథ చెప్పారట. అయితే మహేష్ బాబుకి కథ బాగా నచ్చింది కానీ ఆ క్యారెక్టర్ లో తన కన్నా ప్రభాస్ ఐతే బాగుంటాడని సజెషన్ ఇచ్చాడట. అంతే కాకుండా ప్రభాస్ కి తానే స్వయంగా కాల్ చేశారట.

ఈ సినిమా కథ చాలా బాగుందని, మీరైతే సెట్ అవుతారు కచ్చితంగా చేయండి అని కూడా చెప్పారట. కథ విన్న వెంటనే ప్రభాస్ కి ఆ కథ నచ్చి సినిమా సైన్ చేశారట. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, తాప్సి కూడా నటించారు. అయితే ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. డార్లింగ్ తర్వాత కాజల్, ప్రభాస్ మళ్లీ కలిసి చేసిన ఈ సినిమా ప్రేక్షకులందరికీ ఇప్పటికీ ద బెస్ట్ మూవీ లాగే నిలిచింది.

ఇందులో ప్రభాస్ చేసిన విక్కీ క్యారెక్టర్ కి చాలా మంది కనెక్ట్ అవుతారు. ఆ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్, ఆ డైలాగ్స్ అన్ని ప్రభాస్ కు చాలా బాగా సెట్ అయ్యాయి. సినిమా చూసిన తర్వాత ఆ సినిమాలో ప్రభాస్ ని తప్ప ఇంక ఎవరిని ఊహించుకోలేమేమో అనిపిస్తుంది. అయితే మహేష్ బాబు ఈ సినిమాని తీసుకోకుండా ప్రభాస్ కు ఇచ్చి మంచి పని చేశారు. ఒక పెద్ద హిట్ ప్రభాస్ ఖాతాలో పడేలా చేశారు.


End of Article

You may also like