7 సంవత్సరాల క్రితం ఇదే విషయానికి ట్రోల్ చేశారు… ఇప్పుడు పొగుడుతున్నారు..! సక్సెస్ అంటే ఇదే ఏమో..!

7 సంవత్సరాల క్రితం ఇదే విషయానికి ట్రోల్ చేశారు… ఇప్పుడు పొగుడుతున్నారు..! సక్సెస్ అంటే ఇదే ఏమో..!

by Mohana Priya

Ads

రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఇప్పుడు సూపర్ స్టార్ గా ఎదిగారు మహేష్ బాబు. మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు చేశారు. ఎన్నో ఫ్లాప్ సినిమాలు కూడా చేశారు. కొన్ని మరీ ఘోరపరాజయం పాలయ్యాయి.

Video Advertisement

మహేష్ బాబు రేంజ్ సినిమా కాదు అనే సినిమాలు కూడా వచ్చాయి. ఒక సమయంలో ప్రయోగాలు చేసిన మహేష్ బాబు, గత కొన్ని సంవత్సరాల నుండి కమర్షియల్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. కమర్షియల్ సినిమాల్లో కూడా ఏదో ఒక రకమైన మెసేజ్ ఉండేలాగా చూసుకుంటున్నారు.

comments on mahesh babu and rajamouli

భరత్ అనే నేను నుండి, ఇటీవల వచ్చిన సర్కారు వారి పాట సినిమా వరకు ప్రతి సినిమాతో ఏదో ఒక మెసేజ్ ఇచ్చారు. దాంతో మహేష్ బాబుని మెసేజ్ బాబు అంటూ కామెంట్స్ కూడా చేశారు. అయితే ఇప్పుడు వీటన్నిటికీ దూరంగా ఒక మంచి కమర్షియల్ సినిమా చేయాలి అనే ఉద్దేశంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న గుంటూరు కారం సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రలో మహేష్ బాబు నటించబోతున్నారు.

ఈ సినిమాలో వైరా వెంకట రమణారెడ్డి అనే పాత్రలో మహేష్ బాబు కనిపిస్తారు. ఎమోషన్స్ తో పాటు, యాక్షన్ కూడా ఈ సినిమాలో ఉంటుంది అని సమాచారం. అయితే హీరోలు అన్న తర్వాత వారి మీద ట్రోల్స్ రావడం సహజం. మహేష్ బాబు మీద కూడా తక్కువగా రాలేదు. అందులోనూ ముఖ్యంగా మహేష్ బాబు డాన్స్ మీద కామెంట్స్ వచ్చాయి. “మూమెంట్ ఉండదు” అని, “రోబో డాన్స్ వేసినట్టు ఉంటుంది” అని, ఇలా ఎన్నో రకమైన కామెంట్స్ వచ్చాయి.

mahesh-babu-rare-record2

బ్రహ్మోత్సవం సినిమాలో బాలా త్రిపుర మణి పాటలో మహేష్ బాబు వేసిన స్టెప్స్ కి అయితే థియేటర్లలో జనం పగలబడి నవ్వారు. సినిమా రివ్యూలు ఇచ్చే వాళ్ళు కూడా ఈ స్టెప్ మీద కామెంట్ చేశారు. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా నుండి మహేష్ బాబు డాన్స్ లో కూడా తనని తాను మెరుగుపరుచుకుంటూ వచ్చారు. ఆ సినిమాలో మైండ్ బ్లాక్ పాటలో మహేష్ బాబు డాన్స్ చేశారు. ఆ తర్వాత సర్కారు వారి పాట సినిమాలో కూడా కొన్ని పాటల్లో డాన్స్ వేశారు.

ఇప్పుడు గుంటూరు కారం సినిమా నుండి వచ్చిన కుర్చి మడత పెట్టి పాటలో కూడా మహేష్ బాబు డాన్స్ వేస్తున్నట్టు అర్థం అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పాటలన్నిటికీ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత నుండి చాలా మంది మహేష్ బాబు అభిమానులు, “మా హీరో చేత డాన్స్ వేయించారు. థాంక్యూ” అంటూ శేఖర్ మాస్టర్ కి కామెంట్స్ పెట్టారు.

ఇప్పుడు ఈ పాట చూశాక, అంతకుముందు బ్రహ్మోత్సవం సినిమాకి చేసిన కామెంట్స్ ని గుర్తు చేసుకొని చాలా మంది, “ఒకప్పుడు ఏ విషయానికి అయితే ట్రోల్ చేశారో, ఇప్పుడు అదే విషయానికి పొగుడుతున్నారు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముందు సినిమాలతో పోలిస్తే గత కొంత కాలం నుండి మహేష్ బాబు డాన్స్ మూమెంట్స్ కూడా మెరుగుపడ్డాయి అంటూ చాలా మంది మహేష్ బాబుని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

watch video :


End of Article

You may also like