Ads
సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు ఒక్కరోజు తేడాతో విడుదల కాబోతున్నాయి. ఈ క్రమంలో ఈ రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. కానీ రెండు చిత్రాలకు ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ కావట్లేదని తెలుస్తోంది.
Video Advertisement
ఇదే సమయంలో వీటికన్నా ముందు రీరిలీజ్ అవుతున్న ఒక పాత సినిమాకి ఈ రెండు సినిమాల కన్నా ఎక్కువగా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఆ మూవీ ఇప్పటికే ఎన్నోసార్లు టీవీలో ప్రసారం అయ్యింది. అలాంటి మూవీకి కొత్త సినిమాల కన్నా ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడంతో హాట్ టాపిక్ గా మారింది. మరి ఏ హీరో మూవీ అనేది ఇప్పుడు చూద్దాం..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్’ మూవీ ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ నాలుగు రోజుల క్రితమే ఓపెన్ అయ్యాయి. కానీ ఈ మూవీకి ఆశించిన రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కావట్లేదని తెలుస్తోంది. హైదరాబాద్ లోనే ఇప్పటివరకు కోటి గ్రాస్ మార్క్ కూడా దాటలేదని తెలుస్తోంది. 250 షోలకి, 90 షోలు వరకే హౌస్ ఫుల్స్ అయినట్లు సమాచారం.
ఆగస్ట్ 10న రిలీజ్ అవుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ కండిషన్ కూడా అలాగే కనిపిస్తోంది. ఫస్ట్ డే 391 షోలు మాత్రమే పడుతున్నట్లు సమాచారం. వాటిలో 85 షోలు మాత్రమే హౌస్ ఫుల్ అయినట్టు తెలుస్తోంది. ఈ రెండు ఇలా ఉంటే, ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ అవుతున్న ‘బిజినెస్ మెన్’ మూవీకి ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువగా జరిగాయి.
మహేష్ బాబు బర్త్ డే కి రీరిలీజ్ కానున్న నేపథ్యంలో మహేష్ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ‘బిజినెస్ మెన్’ మూవీకి హైదరాబాద్ లో 172 షోలు బుక్ అయినట్లు తెలుస్తోంది. వాటిలో 110 షోలు హౌస్ ఫుల్స్ అయ్యాయని, ఇప్పటికే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కోటి రూపాయల గ్రాస్ మార్క్ ను దాటేసిందని తెలుస్తోంది.
Also Read: “జైలర్” మూవీ కోసం “రజినీకాంత్” షాకింగ్ రెమ్యూనరేషన్..!
End of Article