కరోనా సమయంలో ఈ మహిళా బాబా ఎంత పని చేసిందో చూడండి…పోలీసులపై కత్తి దూసి చివరికి?

కరోనా సమయంలో ఈ మహిళా బాబా ఎంత పని చేసిందో చూడండి…పోలీసులపై కత్తి దూసి చివరికి?

by Sainath Gopi

కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది. ఆ మహమ్మారి నుండి బయటపడేందుకు మన దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు. ఇటలీ అమెరికా లాంటి పరిస్థి రాకూడదు అంటే ఈ లాక్ డౌన్ సరైన పరిష్కారం. కానీ లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ కొంతమంది ఇంకా బయటకి వస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన ఓ మహిళా బాబా పోలీసులకు సవాల్ విసిరింది.

Video Advertisement

దేశమంతా కర్ఫ్యూ పాటిస్తుంటే భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఆ మహిళా బాబా. వివరాల ప్రకారం…ఉత్తరప్రదేశ్ లోని మహాదేవ్ పుర కి చెందిన ఆ మహిళ తనని తానూ ఆదిశక్తిగా పిలుచుకుంటుంది. అక్కడే ఒక చిన్న సైజు ఆశ్రమం లాంటిదని ఏర్పాటు చేసుకొని బాబాగా కొనసాగుతుంది. లాక్ డౌన్ సమయంలో కూడా ఆమె పట్టించుకోకుండా తన కార్యక్రమాలను యధావిధిగా కొనసాగించేందుకు పూనుకుంది.

ఆమె అలా చేస్తూ ఉండటంతో స్థానికులు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి అక్కడున్న జనాలను స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోరారు. వారు పదే పదే హెచ్చరించిన ఆమె వినలేదు. కత్తి దూసి దమ్ముంటే తనను అక్కడి నుండి తొలగించాలని సవాల్ విసిరింది. తన శిస్యులను కూడా ఉసిగొల్పింది. పోలీసులు అరెస్ట్ చేస్తామని చెప్పిన వినలేదు. దీంతో మహిళా పోలీసులు ఆమెనుంచి కత్తిని లాక్కొని ఆమెను అరెస్ట్ చేసారు. ఆమెను అరెస్ట్ చేయడంతో ఆమె శిస్యులంతా అక్కడి నుండి పారిపోయారు. దెబ్బకి పరిస్థితి అదుపులోకి వచ్చింది.

watch video:


You may also like

Leave a Comment