Ads
రష్యా లో నివసించే ఒక మహిళకు అనారోగ్య సమస్య ఎదురయ్యిందట. కడుపులో ఏదో తిప్పుతున్నట్టు అనిపించడంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు తనని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారట. ఇప్పుడు చెప్పినది చదివి మీలో చాలా మందికి అసలు ఇది ఒక వార్తా? అని అనిపిస్తుంది. ఒకసారి పూర్తిగా చదవండి. అసలు కారణం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.
Video Advertisement
అయితే, డాక్టర్లు ఆ మహిళ కి పరీక్ష చేశారట. ఆ మహిళకు మత్తు మందిచ్చి ఒక పైప్ ని గొంతు లోకి దూర్చారట. మామూలుగా తిన్నదరగక పోవడం వల్ల లేదా ఇంకేదైనా కారణం వల్ల ఇన్ డైజేషన్ సమస్య వచ్చి ఉండొచ్చు. కాబట్టి పైప్ తో క్లీన్ చేయొచ్చు అనుకున్నారు డాక్టర్లు. కానీ ఆ మహిళ కడుపులో పాము ఉన్నట్టు తెలిసింది. గ్రిప్పర్ సహాయంతో ఆ పామును బయటికి తీశారట.
ఆ పాము పొడవు దాదాపు 1.2 మీటర్లు ఉందట. పామును బయటికి తీసిన తర్వాత పక్కన ఉన్న నర్స్ పాముని చూసి భయపడ్డారట. డాక్టర్లకి అసలు ఆ పాము ఆమె శరీరం లోకి ఎలా వెళ్ళింది అనే విషయం అర్థం కాలేదట. అంతేకాకుండా ఆ మహిళ కి కూడా ఆ పాము తను లోపలికి ఎలా వెళ్ళింది అనే విషయం తెలియదట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బహుశా ఆమె నిద్రపోతున్నప్పుడు పాము నోట్లో కి వెళ్లి ఉండొచ్చు అని అంటున్నారు.
End of Article