కరోనా నేపథ్యంలో ఆటో డ్రైవర్ క్రియేటివిటీకి మహింద్ర చైర్మన్ ఫిదా!

కరోనా నేపథ్యంలో ఆటో డ్రైవర్ క్రియేటివిటీకి మహింద్ర చైర్మన్ ఫిదా!

by Megha Varna

ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా దాదాపు అన్ని దేశాలలో లాక్ డౌన్ విధించారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం పాటిస్తూ తీసుకుంటన్న చర్యల వలన మాత్రమే దీనిని అన్ని దేశాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి . ఈ నేపథ్యంలో మందుల్లేని మహమ్మారి కరోనా ను అదుపు చేయడానికి వ్యక్తిగత పరిశుభ్రత ,సామాజిక దూరం పాటించడమే మన ముందు ఉన్న ఏకైక మార్గం.

Video Advertisement

ప్రస్తుతం ఉన్న ఇలాంటి పరిస్థితులలో ఒక వినూత్న ఆలోచన చేసాడు ఒక ఆటో డ్రైవర్.ఆటో రిక్షాను అరలుగా మర్చి ప్రయాణికులకు సామాజిక దూరం ఉండేటట్లు తయారుచేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .కాగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మహింద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్ర ఆటోరిక్షాను ఐదు భాగాలుగా విభజించిన ఆ డ్రైవర్ వినూత్న ఆలోచనపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇద్దరు ప్రయాణికులు ఒకరితో ఒకరు ప్రత్యక్షంగా శారీరక సంబంధాలు లేకుండా సామాజిక దూరం పాటించేలా ఆటోను డిజైన్ చేసిన వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసారు.కరోనా ఇన్నోవేషన్ అంటూ తన ఈ -రిక్షాను నలుగురు ప్రయాణికులు కోసం నాలుగు గదులుగా ఎలా వేరుచేసాడో చూపిస్తుంది .డ్రైవర్ సీట్ కూడా ప్రయాణికుల ప్రాంతం నుండి వేరు చేయబడి ఉంటుంది.ఆ వీడియో ను ఆనంద్ మహింద్ర  ట్వీట్ చేస్తూ ‘మా ప్రజల సామర్ధ్యాలు వేగంగా కొత్తగా మరియు ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా మారడం నన్ను ఎప్పుడూ  ఆశ్చర్యపరుస్తుంది’ అని తెలిపారు ..

 

ఆ డ్రైవర్ యొక్క క్రియేటివ్ ఐడియాను చూసి ఆనంద్ మహింద్ర చాలా సంతోషించారు.తదుపరి ఆ వీడియోను ‘ఆటో అండ్ ఫార్మ్ సెక్టార్స్’,మహింద్ర అండ్ మహింద్ర లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ బెజురికార్న్ కు టాగ్ చేసి ఆ డ్రైవర్ ను తన రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు ఉత్త్పత్తి అభివృద్ధి బృందాలకూ  సలహాదారునిగా నియమించాలని తెలిపారు .. కాగా, 27 సెకండ్ల నిడివిగల ఈ వీడియోకు 10 వేల వ్యూస్‌ రాగా.. 9 వేల లైకులు వచ్చాయి.


You may also like

Leave a Comment