దిశా ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం దిశా చట్టాన్ని ప్రవేశపెట్టింది. అంతేకాకుండా దిశా అనే ప్రత్యేకమైన యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆపదలో ఉన్న మహిళలు ఈ యాప్‌లోని SOS బటన్ ప్రెస్ చేయగానే ఈ సమాచారాన్ని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కి అందిస్తారు. తద్వారా gps ద్వారా వారు అక్కడికి చేరుకుంటారు. ఇప్పుడు ఈ యాప్ ఓ మహిళ ప్రాణాలు కాపాడింది. వివరాలలోకి వెళ్తే..

Video Advertisement

మంగళవారం తెల్లవారుజామున విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో ఓ మహిళా అధికారి పట్ల తోటి ప్రయాణికుడు తప్పుగా ప్రవర్తించాడు. ఆమె వెంటనే దిశా యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. ఉదయం 4.21 నిమిషాలకు మంగళగిరిలోని దిశా కాల్ సెంటర్‌కు SOS కాల్ వెళ్లింది. క్షణాల్లో రంగంలోకి దిగిన ఏలూరు త్రీటౌన్ పోలీసులు 04.27 నిమిషాలకు అక్కడికి చేరుకున్నారు. అంటే కేవలం ఆరు నిమిషాల్లో చేరుకున్నారు. బస్సులో వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. అతనిని ఓ ప్రొఫెసర్ గా గుర్తించారు.

watch video: